iDreamPost
android-app
ios-app

నందమూరి తారకరామారావుకు బెస్ట్ విషెస్ అందించిన యంగ్ టైగర్..

  • Published Oct 30, 2024 | 4:02 PM Updated Updated Oct 30, 2024 | 4:02 PM

Nandamuri Taraka RamaRao: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఎన్టీఆర్ ను పరిచయం చేశారు. ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే?

Nandamuri Taraka RamaRao: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఎన్టీఆర్ ను పరిచయం చేశారు. ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే?

  • Published Oct 30, 2024 | 4:02 PMUpdated Oct 30, 2024 | 4:02 PM
నందమూరి తారకరామారావుకు బెస్ట్ విషెస్ అందించిన యంగ్ టైగర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించి ఆకలి తీర్చాడు జూనియర్ ఎన్టీఆర్. థియేటర్లలో మాస్ జాతర కొనసాగింది. దేవర దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. రికార్డు కలెక్షన్లతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. తారక్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసింది దేవర మూవీ. దీంతో యంగ్ టైగర్ అప్ కమింగ్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటీ ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఏంటీ? అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే తాజాగా తారక్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతున్నాడు. నందమూరి వంశం నుంచి నాలుగో తరం వారుసుడు వెండితెరపై అలరించబోతున్నారు.

నందమూరి అభిమానులకు ఇది మరింత హ్యాపీనెస్ ఇచ్చే సందర్భం. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని బాల కృష్ణ, హరి కృష్ణ తెలుగు సినీమా చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తమ వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు నందమూరి నాలుగో తరం వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను మరెవరో కాదు నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జాన‌కిరామ్ కుమారుడు తార‌క రామారావు. ఈయన హీరోగా వైవీఎస్ చౌద‌రి ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి వైవీఎస్.. తార‌క రామారావు ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు. తారకరామారావు ఫస్ట్ లుక్ తెగ ఆకట్టుకుంటోంది. నందమూరి ఫ్యాన్స్ ఈ యంగ్ హీరోకు ఆల్ దిబెస్ట్ చెప్తున్నారు. నందమూరి నటవారసునికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ ఫుల్ లుక్ లో దర్శనం ఇచ్చాడు నందమూరి నాలుగో తరం నటవారసుడు.

ఈ క్ర‌మంలో ఆయ‌నకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ బాబాయ్‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ల‌తో పాటు ప‌లువురు ట్వీట్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ యంగ్ టైగర్ ట్వీట్ చేశారు. ‘రామ్‌కు ఆల్‌ది బెస్ట్‌.. ఇది నీ మొద‌టి అడుగు. సినీ ప్ర‌పంచం మీకు లెక్క‌లేన‌న్ని ఆనంద‌క్ష‌ణాల‌ను అంద‌జేస్తుంది. మీకు అన్ని విజ‌యాలే ద‌క్కాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. నీ ఫ్యూచర్ దేదీప్య‌మానంగా వెలిగిపోవాలి మై బాయ్” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయంకాబోతున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş