Vinay Kola
Money Saving Schemes: మీరు డబ్బులు ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే రిస్క్ లేకుండా కొన్ని గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి.
Money Saving Schemes: మీరు డబ్బులు ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే రిస్క్ లేకుండా కొన్ని గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి.
Vinay Kola
పెద్దగా రిస్క్ లేకుండా మంచి రాబడులు సంపాదించాలని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి మార్గాల కోసం ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. పైగా ఇవి గవర్నమెంట్ స్కీమ్స్. రిస్క్ తక్కువుగా ఉంటుంది. ఇక ఆ స్కీమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తక్కువ రిస్క్ తో మంచి లాభాలు కోరుకునే వారికి పోస్టాఫీస్ స్కీమ్‌స్ చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఈ పథకాలలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌స్ లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ డబ్బుని మధ్యలో డ్రా చేసుకోలేము. కానీ పోస్టాఫీస్ స్కీమ్‌స్ లో అలా ఉండదు. మనకు అవసరమనుకుంటే చిన్న నోటీస్ ఇచ్చి, కొంచెం లేదా పూర్తిగా పథకంలోని డబ్బులను తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి రిస్క్ లేకుండా, మంచి రాబడి ఇచ్చే పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఈ స్కీమ్ ద్వారా మనం పొందే రాబడిపై టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది.
అలాగే ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా మంచి పెట్టుబడి మార్గాలు. ఎందుకంటే ఇన్‌కం ట్యాక్‌స్ రూల్, సెక్షన్ 80సీ కింద ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.1.5 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇక ఇండియాలో మోస్ట్ పాపులర్ స్కీమ్స్ లో పీపీఎఫ్ ఒకటి. ఈ స్కీమ్ లో సంవత్సరానికి 7.1% వడ్డీ రేటు ఇస్తారు. పైగా ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీ కింద టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇందులో అసలుపైనే కాదు, వడ్డీపై కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఇక ఆడపిల్లలు ఉన్న తల్లి దండ్రులకు అయితే సుకన్య సమృద్ధి యోజనకి మించిన బెస్ట్ సేవింగ్స్ ఇంకోటి ఉండదు. 10 ఏళ్లలోపు ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన గవర్నమెంట్ స్కీమ్ ఇది. తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఇద్దరు ఆడ పిల్లల కోసం 2 వేర్వేరు అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్ల తరువాత గానీ, లేదా ఆడబిడ్డకు 18 ఏళ్లు నిండిన తరువాత వివాహ ఖర్చుల కోసం ఈ డబ్బులని విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ పథకం కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే రెండు అకౌంట్ల కంటే ఎక్కువ ఓపెన్ చేయకూడదు.
ఇక 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కూడా మంచి స్కీమ్స్ ఉన్నాయి. పదవీ విరమణ తరువాత ప్రతి నెలా పింఛన్ కావాలని ఆశించే వారికి నేషనల్ పెన్షన్ స్కీమ్ చాలా బాగుంటుంది. అలాగే వీరి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే, వడ్డీ రూపంలో మంచి ఆదాయం వస్తుంది. ఈ పథకాలు తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు ఇస్తాయి. ఇక ఈ స్కీమ్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.