iDreamPost
android-app
ios-app

హీరోయిన్స్‌ను మించిన అందం.. ఈమె ఓ స్టార్ క్రికెటర్ కూతురు అని తెలుసా?

  • Published Oct 17, 2024 | 11:57 AM Updated Updated Oct 17, 2024 | 11:57 AM

VVS Laxman Daughter: నెట్టింటా ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలోని అమ్మాయి హీరోయిన్స్ ను మించిన అందంతో నెటిజన్ల మది దోచేస్తుంది. ఆమె ఓ స్టార్ క్రికెటర్ కూతురు అని తెలుసా?

VVS Laxman Daughter: నెట్టింటా ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలోని అమ్మాయి హీరోయిన్స్ ను మించిన అందంతో నెటిజన్ల మది దోచేస్తుంది. ఆమె ఓ స్టార్ క్రికెటర్ కూతురు అని తెలుసా?

హీరోయిన్స్‌ను మించిన అందం.. ఈమె ఓ స్టార్ క్రికెటర్ కూతురు అని తెలుసా?

క్రికెట్ కు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. మన దేశంలో క్రికెట్ ను ఎంతలా ప్రేమిస్తారో వేరే చెప్పక్కర్లేదు. మ్యాచ్ ఉందంటే చాలు క్రికెట్ లవర్స్ రెక్కలు కట్టుకుని స్టేడియాల్లో వాలిపోతుంటారు. క్రికెట్ ప్లేయర్స్ ను ఎంతగానో అభిమానిస్తుంటారు. వారిని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని లైఫ్ లో ఎదగాలని భావిస్తుంటారు. తమ ఫేవరెట్ ప్లేయర్స్ బాల్ తో, బంతితో చెలరేగుతుంటే వారి ఆనందానికి హద్దే ఉండదు. కేరింతలతో గ్రౌండ్ ను హోరెత్తిస్తుంటారు. తమ అభిమాన క్రికెట్ ప్లేయర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. భారత క్రికెట్ లో ఎంతో మంది లెజెండ్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఒకరు వీవీఎస్ లక్ష్మణ్. క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

కాగా ఇప్పుడు ఈ లెజెండ్ ప్లేయర్ కూతురుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది. హీరోయిన్స్ ను మించిన అందంతో నెటిజన్స్ మది దోచేస్తుంది. సాధారణంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు ఆటో మేటిక్ గా ఫాలోయింగ్ ఉంటుంది. స్టార్ కిడ్స్ పిల్లలను ఇట్టే గుర్తుపట్టేస్తారు. కానీ క్రికెటర్స్ పిల్లలకు అంతలా రికగ్నిషన్ ఉండదనే చెప్పాలి. కానీ, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఏంజిల్ లుక్ లో సారా మనసులను దోచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ కూతురు అచింత్య అదే రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇటీవల వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన తిరుమలను సందర్శించారు.

కళియుగ దైవం వేంకటేశ్వర స్వామికి అపర భక్తుడైన లక్ష్మణ్ శ్రీవారికి 15 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆలయ పుష్పాలంకరణకు ఒక రోజు ఖర్చు 15 లక్షలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫోటోలు కాస్త నెట్టింటా వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో లక్ష్మణ్ కూతురు అచింత్య తళుక్కుమని మెరిసింది. మతిపోగొట్టే అందంతో ఉన్న ఆమెను ఆసక్తిగా గమనించారు నెటిజన్స్. హీరోయిన్స్ ను మించిన అందంతో అచింత్య సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అచింత్య ఎంతో పద్దతిగా, సాంప్రదాయ బద్దంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీవీఎస్ లక్ష్మణ్ 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ గుంటూరుకు చెందిన జీఆర్ శైలజను 2004లో మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి కుమారుడు సర్వజిత్, కుమార్తె అచింత్య ఉన్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap