iDreamPost

ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ.10 నాణేలతో కొనుగోలు చేసిన వ్యక్తి

  • Published Feb 19, 2024 | 5:30 PMUpdated Feb 19, 2024 | 5:34 PM

సాధారణంగా ఎవరైనా ఏదైనా బైక్ కానీ , కార్ కానీ కొనుగోలు చేయాలంటే .. డబ్బును క్యాష్ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ ఇస్తూ ఉంటారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న నాణేలతో ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా ఎవరైనా ఏదైనా బైక్ కానీ , కార్ కానీ కొనుగోలు చేయాలంటే .. డబ్బును క్యాష్ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ ఇస్తూ ఉంటారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న నాణేలతో ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 19, 2024 | 5:30 PMUpdated Feb 19, 2024 | 5:34 PM
ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ.10 నాణేలతో కొనుగోలు చేసిన వ్యక్తి

ఈ మధ్య కాలంలో ఓ రకంగా చిల్లర కనుమరుగైపోయిందని చెప్పి తీరాలి. ఎక్కడో చిన్న చిన్న కిరాణా షాప్స్ లో అపుడపుడు మనకి నాణేలు కనిపిస్తూ ఉంటున్నాయి. అలానే, ఎవరైనా కానీ, పెద్ద పెద్ద షో రూమ్స్ లో బైక్ , కార్ ఇలాంటి వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే.. వారి వద్ద సరిపడా అమౌంట్ ఉంటే క్యాష్ అంత ఒకేసారి పే చేస్తారు. లేదా ఈఎంఐ లో పే చేస్తారు. కానీ , వీటికి భిన్నంగా ఒక రూపాయి, రెండు రూపాయల చిల్లర నాణేలను తీసుకుని.. షో రూమ్ కి వెళ్లి బైక్ కొనుగోలు చేసిన వ్యక్తుల గురించి కూడా మనం ఇప్పటివరకు వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు ఇదే తరహాలో ఓ వ్యక్తి .. బైక్ కొనేందుకు పెద్ద పెద్ద బరువైన సంచులతో షో రూమ్ కి వెళ్ళాడు. అది చూసిన అక్కడ స్టాఫ్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు. అందులో ఉన్న చిల్లర నాణేలను చూసి అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో అన్ని రూ. 10 నాణేలు ఉన్నాయి.

ఈ సంఘటన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో చోటు చేసుకుంది. అక్కడ నివసిస్తున్న ఓ వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షో రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఏథర్ 450 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తనకు చూపించమని అడిగాడు. అయితే, ఆ స్కూటర్ ధర రూ.1,09,947 నుంచి రూ. 1,44,871 మధ్య ఉంటుందని .. షో రూమ్ సిబ్బంది తెలియజేశారు. దీనితో ఆ వ్యక్తి తాను తెచ్చిన సంచులను వారి ముందు గుమ్మరించాడు. అవి చూసిన షో రూమ్ స్టాఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సంచులలో ఉన్నవన్నీ రూ. 10 నాణేలే. చివరికి ఆ సంచులలో ఉండే మొత్తం కాయిన్స్ తోనే.. ఆ వ్యక్తి తానూ అనుకున్న స్కూటర్ ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్నీ స్వయంగా ఆ కంపెనీ సీఈఓ తెలియజేశారు.

కాగా, ఏథర్ ఎనర్జీ కంపెనీ సీఈఓ అయినా తరుణ్ మెహతా.. ఈ విషయాన్నీ తానే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ కస్టమర్ కు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ తాళాలు ఇస్తున్న ఫోటోను .. షేర్ చేస్తూ కొత్త ఏథర్ యజమాని అంటూ ఫోటోను షేర్ చేశారు. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు వచ్చిన జైపూర్ కస్టమర్.. మొత్తం రూ.10 కాయిన్లు ఇచ్చారని తెలియజేశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఏ మోడల్‌ను ఆ కస్టమర్ కొనుగోలు చేశాడు అనే విషయాన్ని మాత్రం .. ఆ కంపెనీ ఓనర్ చెప్పలేదు. ఏథర్ 450 సిరీస్‌లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. మోడల్ ని బట్టి వాటి ధర రూ.1.10 లక్షల నుంచి రూ. 1.45 లక్షల మధ్య ఉండొచ్చు. మరి, ఈ వ్యక్తి ఏ మోడల్ ను కొనుగోలు చేశాడు అనేది మాత్రం తెలియదు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి