iDreamPost

వివాహేతర శృOగారం నేరం కాదు.. హై కోర్టు సంచలన తీర్పు!

Rajasthan High Court: వివాహేతర శృOగారం సంబంధాలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. పెళ్లైన తర్వాత తన జీవిత భాగస్వామితో కాకుండా వేరొకరితో లైంగిక చర్యలో పాల్గొంటే దాన్ని వివాహేతరం సంబంధం అంటారు.

Rajasthan High Court: వివాహేతర శృOగారం సంబంధాలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. పెళ్లైన తర్వాత తన జీవిత భాగస్వామితో కాకుండా వేరొకరితో లైంగిక చర్యలో పాల్గొంటే దాన్ని వివాహేతరం సంబంధం అంటారు.

వివాహేతర శృOగారం నేరం కాదు.. హై కోర్టు సంచలన తీర్పు!

దేశంలో వివాహబంధానికి ఎంతో విలువనిస్తారు. వేదమంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా జంటలు పెళ్లైన ఏడాదికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉండం, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగి విడాకుల వరకు వెళ్తున్నారు. తాజాగా వివాహేతర శృOగారం నేరం కాదు అని హై కోర్టు తీర్పునిర్చింది. ఏ రాష్ట్రం.. ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దాంపత్య జీవితంలో తృప్తి లేనివారు..ఇతర కారణాల వల్ల వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇది కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా వివాహేతర శృOగారం తప్పు కాదని రాజస్థాన్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు మేజర్లు ఏకాభిప్రాయంతో శృOగారం లో పాల్గొంటే శిక్షార్హమైన నేరం కిందకు రాదని తీర్పునిచ్చింది. ఇటీవల తన భార్యను ముగ్గురు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన కోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది.

High court

కోర్టుకు హాజరైన సదరు వివాహిత.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, నింధితులతో తాను గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు ఆమె బయటప పెట్టింది. బాధిత వ్యక్తి తరుపు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. వివాహేతర సంబంధానని దరఖాస్తుదారుడి భార్య అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఇద్దరు మేజర్లు వివాహం కాకుండా సె*క్స్ లో పాల్గొంటే అది నేరం కిందకు రాదని స్పష్టం చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెను శిక్షించాలని కోర్టును భర్త తరుపు న్యాయవాది కోరగా.. ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి