iDreamPost

Cloud Kitchen: క్లౌడ్‌ కిచెన్‌.. ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలకి లక్షలు కురిపించే బెస్ట్‌ బిజినెస్‌!

హైదరాబాద్ కుమారీ ఆంటీ దయ వల్ల నగరాల్లో ఫుడ్ బిజినెస్ ఎలా ఉందో.. ఎంత సంపాదించొచ్చే తెలిసింది. ఇప్పుడు ఈ బిజినెస్ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. ఇదే క్లౌడ్ కిచెన్. ఇంట్లో ఉండే మహిళలు సైతం ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ చేసి.. ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.

హైదరాబాద్ కుమారీ ఆంటీ దయ వల్ల నగరాల్లో ఫుడ్ బిజినెస్ ఎలా ఉందో.. ఎంత సంపాదించొచ్చే తెలిసింది. ఇప్పుడు ఈ బిజినెస్ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. ఇదే క్లౌడ్ కిచెన్. ఇంట్లో ఉండే మహిళలు సైతం ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ చేసి.. ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.

Cloud Kitchen: క్లౌడ్‌ కిచెన్‌.. ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలకి లక్షలు కురిపించే  బెస్ట్‌ బిజినెస్‌!

ఇంతకు ముందు ఫుడ్ బిజినెస్ వల్ల కాస్త కూస్తో లాభాలున్నాయని జనాలకు తెలుసు కానీ..హైదరాబాద్ కుమారీ ఆంటీ దయ వల్ల ఈ బిజినెస్ మరింత హైప్, హోప్ తెచ్చిపెట్టింది. ఎట్లా అంటే వేల నుండి లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైతం.. ఈ ఫుడ్ బిజినెస్‌పై ఫోకస్ పెట్టేంత. మరీ ఈ ఫుడ్ బిజినెస్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది.  రెస్టారెంట్స్, హోటల్స్ చివరకు రోడ్డు సైడ్ చిన్న బండి పెట్టనక్కర్లేదు. ఇంట్లోనే ఉండే మహిళలు కూడా ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ చేసుకోవచ్చు. అయితే క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన ఆహారాన్ని అందిస్తే చాలు. ఇంట్లోనే ఆహార పదార్ధాలను తయారు చేసి ఆఫీసుల్లోని ఉద్యోగులకు డెలివరీ చేయొచ్చు. దీన్నే క్లౌడ్ కిచెన్ అంటున్నారు.

ఇంట్లో ఉంటూనే.. ఇల్లు సర్దుకుంటూనే, భర్తను.. పిల్లలను చూసుకుంటునే ఈ వ్యాపారాన్ని స్టార్ చేసుకోవచ్చు. ఇంతకు ఈ క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ఎలా స్టార్ చేయొచ్చునన్న డౌట్ ఉంటుంది కదా. అయితే ఇది మీ కోసమే. మీ బిజినెస్ ఎలా వృద్ది చేసుకోవాలో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. లక్షలు సంపాదించుకోవచ్చు. తొలుత మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి ఆమోదం పొందాల్సి ఉంటుది. ఇది ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రూ. 1500 నుండి రూ. 2000 వరకు ఖర్చు అవుతుంది. దరఖాస్తు చేసిన 8 రోజులలోపు FSSAI ఖాతా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు FSSAI ఖాతాను ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన Swiggy, Zomatoకి లింక్ చేయాలి.

Cloud kitchen

అప్లికేషన్ ఫిలప్ చేశాక.. మీ మెనుని సిద్దం చేసుకోవాలి. మీరు ఏ వంటలు అయితే చేయగలుగుతారో ఆ ఆహార పదార్ధాల మెనునూ సిద్ధం చేసుకోవాలి. తొలి నాళ్లలో కాస్త కష్టం అనిపించినప్పుడు కేవలం టిఫిన్స్‌తో కూడా ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ చేసుకోవచ్చు. బాగుంది అనుకుంటే.. మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లౌడ్ కిచెన్ నగరాల్లో నయా ట్రెండ్ అవుతుంది. మెక్ డొనాల్డ్స్, డొమినోస్ వంటి పెద్ద బ్రాండ్ క్లౌడ్ కిచెన్‌లను తెరిచాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఎంత లాభాలను తెచ్చిపెడుతోంది. నాగ చైతన్య కూడా షోయు పేరుతో క్లౌడ్ కిచెన్ తెరచిన సంగతి విదితమే. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆరంభం పేరుతో ఓ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసింది. ఇంత భారీ స్థాయిలో పెట్టలేకపోయినప్పటికీ.. చిన్న స్థాయిలో రూ. 15 వేల ఖర్చుతో కూడా ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ చేసుకోవచ్చు.. ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి