iDreamPost

మొన్న కూతురు.. నేడు తల్లి.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం!

మనిషి తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంటాడు. అందుకు తగినట్లు గానే జీవించేందుకు ఎంతో కష్ట పడుతుంటాడు. అలా చివరకి హాయిగానే కుటుంబంతో కలిసి జీవిస్తున్న క్రమంలో అనుకోకుండా జరిగే ఘటనలు విషాదం నింపుతాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలో అదే జరిగింది.

మనిషి తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంటాడు. అందుకు తగినట్లు గానే జీవించేందుకు ఎంతో కష్ట పడుతుంటాడు. అలా చివరకి హాయిగానే కుటుంబంతో కలిసి జీవిస్తున్న క్రమంలో అనుకోకుండా జరిగే ఘటనలు విషాదం నింపుతాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలో అదే జరిగింది.

మొన్న కూతురు.. నేడు తల్లి.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం!

ప్రతి మనిషి తన జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటాడు. తన భాగస్వామి, పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే తన భర్త, పిల్లలతో హాయిగా జీవించాలని ఎంతో ఆశతో ఉంటారు. అలానే కొందరి జీవితాలు ఎంతో అన్యోన్యంగా సాగుతుంటాయి. అయితే కొన్నిసార్లు విధి వారిపై చిన్నచూపు చూసి.. ఆ కుటుంబాల్లో విషాదం నింపుతుంది. ఇలా ఎన్నో అందమైన కుటుంబాల్లో క్షణాల్లో విషాదాలు అలుముకుంటున్నాయి. తాజాగా అలాంటి దారుణమైన ఘటన ఓ కుటుంబలో జరిగింది. రోజుల వ్యవధిలో కూతురు, తల్లి మరణించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో అందమైన కుటుంబాల్లో విషాదాలు నిండుతున్నాయి. కొన్ని రోడ్డు ప్రమాదాల్లో అయితే ఏకంగా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోతుంటాయి. ఇలాంటివి చూసినప్పుడు దేవుడు ఉన్నాడా?..అనే సందేహాలు కూడా వ్యక్తమవుతుంటాయి.

A tragedy in that family!

తాజాగా ఓ కుటుంబం విషయంలోనూ మృత్యువు పంజా విసిరింది. ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు తల్లి, కూతుర్లును బలి తీసుకుంది. ప్రమాదం జరిగిన రోజు కూతురు మరణించగా, చికిత్స పొందుతూ తల్లి మంగళవారం మృతిచెందారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురం మండలం ఎల్ల గ్రామానికి చెందిన చొల్లంగి వెంకట రమణకి గౌతమి(30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీ చైతన్య అనే రెండేళ్ల పాప ఉంది. ఇక వెంకట రమణ ఉపాధి హామి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. జనవరి 13న అన్నవరం సత్యనారయణ స్వామిని దర్శించుకునేందుక బైక్ పై వెంకట రమణ కుటుంబం బయలుదేరింది. అక్కడ సత్యదేవునికి మొక్కులు చెల్లించుకుని తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలోనే గొల్లప్రోలు సమీపంలోకి రాగానే వీరి బైక్ ను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారి కుమార్తె చైతన్య అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ప్రమాదంలో వెంకట రమణ భార్య గౌతమికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందతూ..గౌతమి మంగళవారం మృతి చెందింది. దీంతో నాడు బిడ్డ..నేడు తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గౌతమి మృతితో వారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. తమ కష్టం పగవాడికి కూడ రాకూడదంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి..రోడ్డు ప్రమాదాల నివారణకు  ఏం చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి