iDreamPost

కాణిపాకం ఆలయంలో ఆసక్తికర ఘటన.. అదృష్టం అంటే ఆమెదే!

చిత్తూరు జిల్లాలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఓఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ విషయంలో జరిగిన సంఘటనను చూసి.. అక్కడి భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే...

చిత్తూరు జిల్లాలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఓఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ విషయంలో జరిగిన సంఘటనను చూసి.. అక్కడి భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే...

కాణిపాకం ఆలయంలో ఆసక్తికర ఘటన.. అదృష్టం అంటే ఆమెదే!

నిత్యం మన కళ్ల ముందు అనేక ఆశ్చర్య ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు మన కళ్లను మనమే నమ్మలేము. అంతేకాక కొందరికి జరిగిన ఘటన చూస్తే.. లక్  అంటే వీరిదే అని అనకమానం. అలాంటి ఘటనే తాజాగా కాణిపాకం ఆలయంలో ఓ ఆసక్తికర చోటుచేసుకుంది.  స్వామి వారి దర్శానానికి వచ్చిన ఓ మహిళ విషయంలో అద్భుతం జరిగింది. ఈ సంఘటన చూసిన అందరు.. లక్ అంటే ఆమెది అని అంటారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిత్తూరు జిల్లాలోని ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి నిత్యం  వేలాది మంది భక్తులు వచ్చి..స్వామివారిని దర్శించుకుంటారు. శుక్రవారం ఈ ఆలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిరుపతికిచెందిన లలిత అనే మహిళ వినాయకుడిని దర్శించుకునేందుకు కాణిపాకంకి వచ్చింది. అలా స్వామివారి దర్శనార్థం వచ్చి లలిత శుక్రవారం బంగారు హారం పోగొట్టుకుంది. శుక్రవారం ఉదయం లలిత స్వామివారి దర్శనానికి రాగా ఈ ఘటన చోటుచేసుకుంది.

పోగొట్టుకున్న హారం విలువ రూ.3 లక్షల విలువ ఉంటుందని బాధితురాలు తెలిపారు. తన హారం పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించిన సదరు మహిళ..అక్కడే ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను అడిగింది. అయినా ఫలితం లేకపోవడంతో నిరుత్సాహంతో ఉండి పోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మకు ఆ హారం దొరికింది.  తనకు దొరికిన హారాన్ని ఆమె వెంటనే ఆలయ సూపరింటెండెంట్‌ కోదండపాణికి అందజేశారు.

ఆలయ అధికారులు మైకు ద్వారా హారం విషయాన్ని ప్రకటించారు. దీంతో వెంటనే బాధితురాలు లలిత అధికారులు ఉండే కేంద్రానికి వెళ్లారు. ఆలయ సూపరింటెండెంట్‌ కోదండపాణి ఆమెకు హారాన్ని అప్పగించారు. ఎంతో విలువైన హారం దొరికినా నిజాయితీ తీసుకొచ్చి ఇచ్చిన అనసూయమ్మను ఆలయ సిబ్బందితో పాటు అక్కడ ఉన్న భక్తులు అభినందించారు. అయితే తొలుత భక్తురాలు హారాన్ని పోగొట్టుకున్న విషయాన్ని గమనించలేదట.. మైక్‌లో అనౌన్స్‌మెంట్ తర్వాత  ఆమె చూసుకున్నారు.

అప్పుడు ఆమె చూసుకుంటే హారం లేదు.. ఆ వెంటనే వెళ్లి… ఆ సొమ్ముకు సంబంధించిన వివరాలు చెప్పి.. తెచ్చుకున్నారు. పోయిన హారం దొరకడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మ, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. లలిత ఘటనను చూసి అందరు లక్ అంటే ఈమెదే అంటున్నారు. వెయ్యి రూపాయలు పడిపోతేనే దొరకడమే కష్టం.. అలాంటిది రూ.3 లక్షల విలువ చేసే నగ దొరికిందంటే.. ఆమె నిజంగానే అదృష్టవంతురాలు. మరి. కాణిపాకం ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి