iDreamPost

వర్షాకాలంలో ఈ పొరపాట్లు చేస్తే.. మీ ఏసీ, ఫ్రీజ్‌, టీవీలు కాలిపోవచ్చు!

  • Published Jun 17, 2024 | 2:20 PMUpdated Jun 17, 2024 | 2:20 PM

Rainy Season: ప్రస్తుతం వర్ష కాలంలో కావడంతో.. ఎక్కడబడితే అక్కడ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఈ జాగ్రత్తాలు తీసుకోకపోతే చాలా ప్రమాదం.

Rainy Season: ప్రస్తుతం వర్ష కాలంలో కావడంతో.. ఎక్కడబడితే అక్కడ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఈ జాగ్రత్తాలు తీసుకోకపోతే చాలా ప్రమాదం.

  • Published Jun 17, 2024 | 2:20 PMUpdated Jun 17, 2024 | 2:20 PM
వర్షాకాలంలో ఈ పొరపాట్లు చేస్తే.. మీ ఏసీ, ఫ్రీజ్‌, టీవీలు కాలిపోవచ్చు!

ప్రస్తుతం రైనీ సీజన్ ఎంటర్ అయ్యింది. దీంతో ఈ మధ్య అక్కడక్కడ అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురు గాలులు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే సాధారణంగా ఈ వర్షాకాలంలో బయట కాలు పెడితే ఎంత ప్రమాదమో.. ఇంట్లో ఉండే కొన్ని ఎలక్ట్రిక్ వస్తువుల వలన కూడా అంతే ప్రమాదం ఏర్పుతుంది. ఇక ఈ తుపాను ప్రభవంతో.. సామాన్యులు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే.. భారీగా వర్షాలు కురిసినప్పుడు మెరుపులు, పిడుగుల కారణంగా చాలా ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ లు పేలిపోవడం, మంటలు అంటుకోవడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా.. ఇంట్లో కూడా ఏసీలు, ఫ్రిజ్ లు కాలిపోతుంటాయి. దీంతో ఇళ్లంతా మంటలు చెలరేగి ప్రమాదాలకు దారి తీస్తుంటాయి.

కనుక మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడినప్పుడు ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వర్షం పడుతున్నప్పుడు ముందు చూపుగా ఆలోచించి ఇంట్లో ఉండే ఏసీలు, టీవీలు, ఫ్రీజ్ ల కరెంట్ కనెక్షన్స్ ను తీసియడం వంటివి చేస్తుంటారు. ఎందుకంటే.. ఈ వర్షాలు కారణంగా ఎక్కడ ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ముందుగా జాగ్రత్త పడుతుంటారు. అయితే ఇవి కాకుండా వర్షకాలంలో ఇంట్లో ఇంక ఎలాంటి జాగ్రత్తాలు తీసుకోవాలని చాలామంది సందేహ పడుతుంటారు. మరి, అలాంటి వారి కోసం వర్షకాలంలో ఇంట్లో ఏ జాగ్రత్తాలు పాటించాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

  • ముందుగా వర్షం పడిన సూచనలు ఉన్నప్పుడు ఇంట్లో కిటికీలు, తలుపులు మూసేయయాలి. ముఖ్యంగా.. గ్లాస్ కిటికీలు, తలుపులు కూడా మూసేయడం మంచింది.
  • ఇక మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ వస్తువులు ఏసీ, ఫ్రీజ్‌, మైక్రోవేవ్ టీవీల విద్యుత్‌ కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేయడం మంచింది. ముఖ్యంగా అధిక ఓల్టేజీ ఎలక్ట్రానిక్ వస్తువులతో  చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • అయితే ఈ ఎలక్ట్రిక్ వస్తువులను కేవలం ఆఫ్ చేస్తే సరిపోదు. వీటిని అన్ ప్లగ్ చేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ఏసీ, రిఫ్రిజిరేటర్‌లను కచ్చితంగా అన్‌ప్లగ్ చేయాలి.
  • ఇక ఈ రైనీ సీజన్ లో తుఫాను ఎప్పుడు వస్తుందనేది చెప్పలేము. కనుక ఒక వేళ మీరు ఇంటి నుంచి బయటకు గానీ, ఆఫీసుకు కానీ వెళ్తే ఎలక్ట్రిక్ వస్తువులను డిస్ కనెక్ట్ చేయడం చాలా మంచింది.
  • అంతేకాకుండా.. మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడినప్పుడు మీ ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి ఉంచకూడదు. ఎందుకంటే అవి పేలిపోయే ప్రమాదం ఉంది.
  • ముఖ్యంగా ఇంటి ఎర్తింగ్‌పై శ్రద్ధ పెట్టాలి. ప్రతి ఇంటికి ఎర్తింగ్‌ ఉండలి. 
  • ఇక వాటితో పాటు వర్షం కురస్తున్నప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే.. ల్యాప్‌టాప్‌ ఛార్జ్‌ కూడా చేయకండి. అవసరం ఉంటే తప్ప ల్యాప్‌టాప్‌ను వాడకండి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ఆన్‌ లో ఉంటే వాటిని కూడా వెంటనే షట్‌డౌన్‌ చేయడం చాలా మంచింది.

ఇక వర్షకాలంలో ఈ రకమైన జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం. మరి, వర్షకాలంలో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి