iDreamPost
android-app
ios-app

Wipro: మంచి జాబ్ కోసం చూస్తున్నారా.. విప్రోలో భారీగా ఉద్యోగాలు.. త్వరపడండి

  • Published Apr 13, 2024 | 2:28 PM Updated Updated Apr 13, 2024 | 2:28 PM

మంచి ఉద్యోగం.. అది కూడా హైదరాబాద్ లో దొరికితే బాగుండు అని అనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. విప్రోలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..

మంచి ఉద్యోగం.. అది కూడా హైదరాబాద్ లో దొరికితే బాగుండు అని అనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. విప్రోలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 2:28 PMUpdated Apr 13, 2024 | 2:28 PM
Wipro: మంచి జాబ్ కోసం చూస్తున్నారా.. విప్రోలో భారీగా ఉద్యోగాలు.. త్వరపడండి

చాలా ఐటీ కంపెనీలు తమ సంస్థల నుంచి ఉద్యోగులను తొలగిస్తుండగా.. కొన్ని మాత్రం రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాయి. మీరు కూడా ఇలానే ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా.. అది కూడా టాప్ కంపెనీ కోసం వెతుకుతున్నారా.. అయితే మీ కోసమే. దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మీరు కనక ఐటీ కంపెనీలో మంచి జాబ్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్య సమాచారం :

  • పోస్టులు: ప్రొడక్షన్ ఏజెంట్
  • అర్హత: డిగ్రీ. అడ్‌వర్బ్‌, అడ్‌సెన్స్‌, అడ్వటైజ్‌మెంట్స్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ, గూగుల్ మెయింటనెన్స్‌ పాలసీలపై ప్రాథమిక పరిజ్ఞానం. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన, కంటెట్‌ మెనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌లో అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.
  • జాబ్ లొకేషన్: హైదరాబాద్ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే విప్రో కంపెనీ నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఖర్చులను ఆదా చేయడం కోసం మధ్యస్థాయి ఉద్యోగులను తొలగించింది. విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ భారతదేశంలోని బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ. 2008-09 సంవత్సరానికి గానూ ఐటీ సేవలనందించే భారతీయ సంస్థలలో విప్రో రెండవది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులను తొలగించిన విప్రో.. తాజాగా ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetholiganbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis