iDreamPost

యానిమల్ ముందు టెంప్టింగ్ టార్గెట్! డేంజర్ లో రాజమౌళి రికార్డు!

యానిమల్‌ సినిమా రాజమౌళి రికార్డులను చెరపేయనుందా? యానిమల్‌ తన ముందున్న టెంప్టింగ్‌ టార్గెట్‌ను అందుకుంటుందా? బహుబలి సినిమా రికార్డులను బ్రేక్‌ చేయనుందా?...

యానిమల్‌ సినిమా రాజమౌళి రికార్డులను చెరపేయనుందా? యానిమల్‌ తన ముందున్న టెంప్టింగ్‌ టార్గెట్‌ను అందుకుంటుందా? బహుబలి సినిమా రికార్డులను బ్రేక్‌ చేయనుందా?...

యానిమల్ ముందు టెంప్టింగ్ టార్గెట్! డేంజర్ లో రాజమౌళి రికార్డు!

భారత చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించాలన్నా.. ఆ రికార్డులను తిరగరాయాలన్నా.. అది కేవలం ఎస్‌ఎస్‌ రాజమౌళికి మాత్రమే సొంతం అన్నది జగమెరిగిన సత్యం. జక్కన్న కేవలం ఒక్క సినిమాతో తన సత్తా ఏంటో ఇండియన్‌ సినిమాకు చూపించారు. బాలీవుడ్‌ ఆధిపత్యాన్ని నేల కూల్చి.. ప్యాన్‌ ఇండియా రాజ్యాన్ని స్థాపించారు. బాలీవుడ్‌- సౌత్‌ సినిమా అన్న బ్యారియర్లను లేకుండా చేశారు. ఆయన తీసిన బాహుబలి సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1900 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. హిందీ సినిమాలపై ఉన్న పాత రికార్డులను తుడి పెట్టేసింది. తర్వాత ఆయన తెరకెక్కించిన ‘ ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. కలెక్షన్ల విషయంలో రాజమౌళిని కొట్టే వాడే లేడు అన్న ముద్ర కూడా పడిపోయింది. బాలీవుడ్‌ హీరోల సినిమాలు విడుదలవుతున్నా.. రాజమౌళి సినిమాలు సాధించిన కలెక్షన్ల మార్కును చేరుకోలేకపోతున్నాయి.

అయితే, యానిమల్‌ విషయంలో మాత్రం రాజమౌళి రికార్డులకు గండిపడే అవకాశం ఉంది. ఈ సినిమాపై మొదటినుంచి ఉన్న అంచనాలు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. ఇతర లెక్కలు చూస్తుంటే.. విడుదలైన తర్వాత సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించటం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యానిమల్‌ చిత్రం విడుదలకు ముందే వందల కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ఓటీటీ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి.

డేంజర్ లో రాజమౌళి రికార్డు!

రాజమౌళి తెరకెక్కించిన ‘బహుబలి’ సినిమాపై ఓ రికార్డు ఉంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. యానిమల్‌ సినిమాతో ఈ రికార్డు బ్రేక్‌ అయ్యేలా కనిపిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌కు దేశ వ్యాప్తంగా చాలా క్రేజ్‌ ఉంది. దీనికి తోడు ఆయనది బాలీవుడ్‌. ఉత్తర భారతదేశంలో హిందీ ప్రభావం ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఇక, హిందీ బెల్ట్‌లో సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందనటంలో అనుమానం లేదు. యానిమల్‌కు పాజిటివ్‌ టాక్‌ వస్తే చాటు.. ఉత్తరాదిలో చిత్రం సూపర్‌ సక్సెస్‌ అవ్వటం ఖాయం. సౌత్‌లో సినిమా అభిమానులు ఎక్కువ కాబట్టి.. చిత్రం కొంచెం బాగున్నా నెత్తిన పెట్టేసుకుంటారు. కలెక్షన్లను కుమ్మరిస్తారు.

ఎలాగూ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి..  మొదటి రెండు మూడు రోజులు వసూళ్ల వర్షం కురస్తుంది. పర్లేదు అనిపించుకున్న ‘జవాన్‌’ సినిమాకు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 900కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. అంతకు ముందు ఆయన తీసిన పఠాన్‌ కూడా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మంచి టాక్‌ తెచ్చుకుంద ఇదే తరహాలో.. ఇంతకు మించి ‘యానిమల్‌’ ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బహుబలి రికార్డులు ఈజీ బ్రేక్‌ అవుతాయని అంటున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌.. సందీప్‌ రెండ్డి వంగా ఇప్పుడు రాజమౌళి రికార్డులపై కన్నేశారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. బాహుబలి రికార్డులే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. మరి, యానిమల్‌.. బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేస్తుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి