iDreamPost
android-app
ios-app

ఈ ఐదు టీమ్స్‌ మాత్రమే ఎందుకు స్పెషల్‌ జెర్సీలు ధరిస్తాయి? వీటి వెనకున్న కథేంటి?

  • Published Apr 14, 2024 | 4:10 PM Updated Updated Apr 14, 2024 | 4:51 PM

Special Jersey, IPL 2024: ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్‌ స్పెషల్‌ జెర్సీలతో సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడుతున్నాయి. అయితే.. అలా కేవలం ఒక్క మ్యాచ్‌కే స్పెషల్‌ జెర్సీలతో ఎందుకు బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

Special Jersey, IPL 2024: ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్‌ స్పెషల్‌ జెర్సీలతో సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడుతున్నాయి. అయితే.. అలా కేవలం ఒక్క మ్యాచ్‌కే స్పెషల్‌ జెర్సీలతో ఎందుకు బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 14, 2024 | 4:10 PMUpdated Apr 14, 2024 | 4:51 PM
ఈ ఐదు టీమ్స్‌ మాత్రమే ఎందుకు స్పెషల్‌ జెర్సీలు ధరిస్తాయి? వీటి వెనకున్న కథేంటి?

ఐపీఎల్‌లో మొత్తం 10 టీమ్స్‌ ఉన్నాయి. ప్రతి ఏడాది చిన్న చిన్న మార్పులతో రూపొందించిన జెర్సీలతో సరికొత్త బరిలోకి దిగుతుంటాయి. అయితే.. చాలా టీమ్స్‌ తమ జెర్సీల్లో చాలా మార్పులు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్‌ అనగానే బ్లూ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనగానే ఎల్లో జెర్సీలు గుర్తుకు వస్తాయి. అలాగే ప్రతి టీమ్‌కు వాళ్ల జెర్సీలతో తమకంటే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. అయితే.. కొన్ని టీమ్స్‌ మాత్రం.. ప్రతి ఏడాది ఒక మ్యాచ్‌లో తమ రెగ్యులర్‌ జెర్సీకి పూర్తి భిన్నంగా వేరే కలర్‌ జెర్సీలో బరిలోకి దిగుతుంటాయి. మొత్తం పది టీమ్స్‌లో కేవలం ఐదు టీమ్స్‌ మాత్రమే ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌ను స్పెషల్‌ జెర్సీలతో ఆడుతుంటాయి.

అందులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఉన్నాయి. ఈ ఐదు జట్లు ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌ను మాత్రం స్పెషల్‌ జెర్సీతో ఆడుతున్నాయి. ఈ ఐదు టీమ్స్‌ మాత్రమే ఎందుకు ఇలా స్పెషల్‌ జెర్సీలో ఒక మ్యాచ్‌ ఆడుతాయి? వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ స్పెషల్‌ జెర్సీ అనే సంప్రదాయన్ని మొదలుపెట్టిన ఆర్సీబీ. రెడ్‌ కలర్‌ ఎక్కువగా కనిపించే జెర్సీలో ఆర్సీబీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రెడ్‌ అండ్‌ బ్లూ కాంబినేషన్‌లో కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది.

అయితే.. ప్రతి సీజన్‌లానే ఈ సీజన్‌లో కూడా గ్రీన్‌ కలర్‌ జెర్సీలో ఆర్సీబీ ఒక మ్యాచ్‌ ఆడునుంది. ఈ గ్రీన్‌ జెర్సీలో ఆర్సీబీ మ్యాచ్‌ ఆడటం వెనుక ఒక సదుద్దేశం ఉంది. అదే గో గ్రీన్‌ జెర్సీ. ఇది పరిశుభ్రమైన, పచ్చటి వాతావరణం గురించి అవగాహన కల్పించడం కోసం ఆర్సీబీ గ్రీన్‌ కలర్‌ జెర్సీలో ఆడుతుంది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌.. పింక్‌ ప్రామిస్‌లో భాగంగా గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారత కోసం ఫుల్‌ పింక్‌ కలర్‌ జెర్సీలో మ్యాచ్‌ ఆడుతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను ఆడేసింది ఆర్‌ఆర్‌.

2022 సీజన్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు కూడా స్పెషల్‌ జెర్సీలో బరిలోకి దిగుతాయి. ఐకానిక్ స్పోర్ట్స్ క్లబ్ వారసత్వాన్ని గౌరవించేందుకు భారత ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్‌కు మద్దతుగా బ్రౌన్ అండ్‌ గ్రీన్‌ కలర్‌ జెర్సీలో ఎల్‌ఎస్‌జీ బరిలోకి దిగుతుంది. అలాగే క్యాన్సర్‌పై పోరాటానికి మద్దతుగా లావెండర్ జెర్సీలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆడునుంది. ఇక చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్‌ చారిత్రాత్మక నగర పటం, ఐకానిక్ మెట్రో లైన్‌ను కలిగి ఉన్న ఢిల్లీ నగర వారసత్వం, ఆవిష్కరణలచే స్ఫూర్తి పొందిన బ్లూ జెర్సీలో ఒక మ్యాచ్‌ ఆడుతుంది. ఇలా ఈ ఐదు జట్ల స్పెషల్‌ జెర్సీల వెనుక ఒక్కో మంచి కారణం ఉంది. మరి ఈ స్పెషల్‌ జెర్సీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.