iDreamPost

జనగణమన మీద డబుల్ ఒత్తిడి

జనగణమన మీద డబుల్ ఒత్తిడి

మాములుగా ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా వచ్చినప్పుడు అది బ్లాక్ బస్టర్ అయితే తర్వాత అదే కాంబోలో తయారయ్యే మూవీకి అంచనాలు రెట్టింపు అవుతాయి. బాలకృష్ణ బోయపాటి శీనుల కలయిక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించిన మరొకటి గొప్ప విజయాలు అందుకున్నాయి. కొన్ని సార్లు రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కడు ఇచ్చాక గుణశేఖర్ మహేష్ బాబులు అర్జున్ చేస్తే అది యావరేజ్ అందుకోవడానికే నానా కష్టాలు పడింది. సరే ఇంకోసారి ట్రై చేద్దామని సైనికుడు కోసం చేతులు కలిపారు. కట్ చేస్తే అది ప్రిన్స్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం లైగర్. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ – కరణ్ జోహార్ – మైక్ టైసన్ కాంబోలో చాలా క్రేజీగా నిర్మాణం జరుపుకున్న ఈ బాక్సింగ్ డ్రామాకు డిజాస్టర్ రిపోర్ట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల మొదటి రోజు మంచి ఫిగర్సే నమోదయినప్పటికీ ఇవాళ్టి నుంచి డ్రాప్ సహజంగానే ఉంటుంది. ఇది నిర్మాణంలో ఉన్నప్పుడే పూరి విజయ్ లు తమ రెండో ప్రాజెక్ట్ జనగణమనను అఫీషియల్ గా లాంచ్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే ఈ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలో విజయ్ దేవరకొండ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. లైగర్ హిట్ అయ్యుంటే దీని బిజినెస్ కి చాలా హెల్ప్ అయ్యేది కానీ జరిగింది వేరు.

డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు లైగర్ లాస్ వెంచర్ కానుంది. ఈ నష్టాలు పూడ్చాలంటే జనగణమనను తగ్గించి ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే రికవరీ చాలా కష్టం. ఇది ముందే ఊహించి రెండో సినిమాకు ఫిక్స్ అయ్యారా లేక సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో లాక్ చేసుకున్నారా అనేది ఆ ఇద్దరికీ తెలిసిన రహస్యం. సో లైగర్ లో జరిగిన పొరపాట్లు దారుణమైన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా అభిమానుల అసంతృప్తిని, పబ్లిక్ ఒపీనియన్స్ ని సీరియస్ గా తీసుకుని అవసరమైన చోట మార్పులు చేసుకోవడం చాలా అవసరం. లేదంటే బిజినెస్ పరంగా ఇబ్బంది పడక తప్పదు. ఊరికే ప్యాన్ ఇండియా ట్రాప్ లో పడకుండా స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడితే బెటర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి