iDreamPost
android-app
ios-app

బుజ్జి కారుని పెట్రోల్ వేరియంట్‌లో కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనే ఎందుకు చేశారు?

Why Bujji Made As Electric: బుజ్జి కారు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. కల్కి సినిమాలో బుజ్జి పాత్ర ప్రభాస్ తో పాటు ట్రావెల్ అవుతుంది. దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసిన ఈ బుజ్జి కారుని పెట్రోల్ వేరియంట్ లో కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్ లోనే ఎందుకు తయారు చేసినట్టు?

Why Bujji Made As Electric: బుజ్జి కారు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. కల్కి సినిమాలో బుజ్జి పాత్ర ప్రభాస్ తో పాటు ట్రావెల్ అవుతుంది. దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసిన ఈ బుజ్జి కారుని పెట్రోల్ వేరియంట్ లో కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్ లోనే ఎందుకు తయారు చేసినట్టు?

బుజ్జి కారుని పెట్రోల్ వేరియంట్‌లో కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనే ఎందుకు చేశారు?

ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా అంతంత మాత్రంగానే ఉంది. కొనేందుకు చాలా మంది భయపడుతున్నారు. పెట్రోల్ వేరియంట్స్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అనేవి తక్కువే. అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో బుజ్జి కారుని తయారు చేశారు. ఈ బుజ్జి కారు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ప్రముఖ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా టీమ్ మరియు కోయంబతూర్ కి చెందిన జయరాం మోటార్స్ సంస్థలు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ బుజ్జి కారు ప్రత్యేకతలు చూసి చాలా మంది ఫిదా అయిపోయారు. నాగచైతన్య కూడా ఈ బుజ్జి కారుని నడిపారు.

బుర్ర పాడు చేస్తున్న ఈ కారు పేరు బుజ్జి పాడ్. మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ ఎలక్ట్రిక్ రోబో కారు ఇది. దీనికి మూడు టైర్లు ఉన్నాయి. ఒక్కో టైర్ బరువు 250 కేజీలు. మొత్తం మూడు టైర్లు 750 కిలోల బరువు కలిగి ఉన్నాయి. ఇక బుజ్జి కారు 6 టన్నుల బరువు ఉంది. బుజ్జి కారులో వాడిన బ్యాటరీ కెపాసిటీ 47 కిలో వాట్లుగా ఉంది.అయితే ఈ కారుని పెట్రోల్ వేరియంట్ తో కాకుండా ఫుల్లీ ఎలక్ట్రిక్ వేరియంట్ లో చేయడానికి కారణం ఏంటి అన్న సందేహం మీకు కలిగిందా? ఇలా చేయడానికి కారణం ఉంది. కల్కి 2898 ఏడీ సినిమా అనేది ఫ్యూచర్ మీదనే ఆధారపడి ఉంటుంది. 874 సంవత్సరాల తర్వాత జరగబోయే కథ ఇది. 874 సంవత్సరాల తర్వాత అంటే అప్పటికి టెక్నాలజీ ఏ స్థాయిలో డెవలప్ అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటికే చమురు కొరతతో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు కాలుష్యం కారణంగా ప్రకృతి నుంచి సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎక్కువగా కృషి చేస్తుంది.

ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే హవా కాబట్టి పెట్రోల్ వాహనాలు కనిపించకపోవచ్చు. అలాంటిది 874 సంవత్సరాల తర్వాత అంటే పెట్రోల్ కారు ఉండేది అని ఎక్కడో ఎవరో చెబితేనో, ఎక్కడో రాసింది చదివితేనో గానీ తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఖచ్చితంగా బుజ్జి కారుని ఎలక్ట్రిక్ వేరియంట్ లోనే తయారు చేయాలి. అది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేయాలి. ఈ కారణం వల్లే కల్కి చిత్రబృందం బుజ్జి కారుని పెట్రోల్ వేరియంట్ తో కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్ లో తయారు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి