iDreamPost

KTR తరువాత తెలంగాణ IT శాఖా మంత్రి ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముగిశాయి. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముగిశాయి. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతుంది.

KTR తరువాత  తెలంగాణ IT శాఖా మంత్రి ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

తెలంగాణలో ఎన్నికలు, ఫలితాలు అన్నీ ముగిసాయి. మార్పు కావాలనుకున్న తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడ్డ బీఆర్ఎస్ కి ఈసారి నిరాశ ఎదురైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్యాబినెట్ సిద్ధం చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తుంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ మొదలైంది. ఇలాంటి సమయంలో మరో అంశం కూడా తెలంగాణ యువతలో ఆసక్తిని కలిగిస్తోంది. అదే తెలంగాణ ఐటీ శాఖా మంత్రిగా ఎవరు వస్తారు అన్నది? కేటీఆర్ తరువాత.. ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు? పెట్టుబడులు కురిపించి, ఉద్యోగాలను పెంచేది ఎవరు? వంటి అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ ఒక్క సమాచార సాంకేతికత శాఖా విషయంలోనే ప్రజలకి ఇంతటి ఆసక్తి దేనికి? సోషల్ మీడియాలో ఈ శాఖా గురించి మాత్రమే అప్పుడే చర్చ రావడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐటీ.. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగం. ఓ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు అన్నీ ఈ శాఖ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణకి ఐటీ హబ్ గా గుర్తింపు ఉన్న హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరు. ఇలాంటి కీలక స్థానంలో గత 10 ఏళ్లుగా కేటీఆర్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి కేటీఆర్ చాలానే కష్టపడ్డారు. వివిధ దేశాల్లోని వివిధ వేదికలపై అద్భుతమైన స్పీచ్ లు ఇచ్చి.. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్లేస్ అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగారు. ఈ క్రమంలోనే సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాద్ తొలిసారి బెంగుళూరుని సైతం క్రాస్ చేయగలిగింది. ఇక గొప్ప ఆవిష్కరణలు చేయగల సామర్ధ్యం ఉన్న యువత కోసం రాష్ట్ర వ్యాప్తంగా టీ- హబ్స్ ఏర్పాటు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. కేటీఆర్ యువతకి దగ్గర అయ్యారు.

తెలంగాణ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హైదరాబాద్ మహానగరం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు పోటీ పడుతుంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ పై ఎక్కువ దృష్టి సారించింది. పరిశ్రమలు వస్తేనే.. రాష్ట్రం ప్రగతి బాటలో నడుస్తుందని అధికార పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అన్ని రకాలుగా కృషి చేశారని అంటారు.  అందుకే హైదరాబాద్ ఈ పదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఎంతో అభివృద్ది సాధించిందని రాజకీయ విశ్లషకులు అభిప్రాయం. మరి కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఎంతో అనుభవజ్ఞులైన వారు ఉన్నారు. ఐటీ రంగంపై మంచి పట్టు ఉన్నవారిని ఐటీ శాఖ మంత్రిగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి