iDreamPost

వర్షం వల్ల జరగని KKR vs GT మ్యాచ్‌… ఎవరి​కి లాభం? ఎవరికి నష్టం?

  • Published May 13, 2024 | 9:27 PMUpdated May 14, 2024 | 6:58 AM

KKR vs GT, IPL 2024: అహ్మాదాబాద్‌ వేదికగా కేకేఆర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దు అయితే.. ఎవరికి నష్టమో, ఎవరికి లాభమో ఇప్పుడు తెలుసుకుందాం..

KKR vs GT, IPL 2024: అహ్మాదాబాద్‌ వేదికగా కేకేఆర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దు అయితే.. ఎవరికి నష్టమో, ఎవరికి లాభమో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 13, 2024 | 9:27 PMUpdated May 14, 2024 | 6:58 AM
వర్షం వల్ల జరగని KKR vs GT మ్యాచ్‌…  ఎవరి​కి లాభం? ఎవరికి నష్టం?

ఐపీఎల్‌ 2024లో భాగంగా సోమవారం రాత్రి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. రెండు టీమ్‌లకు చోరో పాయింట్‌ ఇచ్చారు. అయితే.. ఈ మ్యాచ్‌ రద్దుతో ఏ టీమ్‌కి లాభం ఏ టీమ్‌కి నష్టం అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. పైగా ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఏవో క్లారిటీ లేక బీభత్సమైన గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కేకేఆర్‌ వర్సెస్‌ జీటీ మ్యాచ్‌ రద్దు అయితే.. పరిస్థితి ఏంటి? ఈ రెండు టీమ్స్‌ కాకుండా.. ఏ టీమ్స్‌కి కలిసి వస్తుంది? ఏ టీమ్‌కి నష్టం జరుగుతుందో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

కేకేఆర్‌ ప్రస్తుతం 18 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉంది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కూడా అయిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌ రద్దు అవ్వడం వల్ల ఆ టీమ్‌కు పోయింది ఏమీ లేదు. ఫ్రీగా ఒక పాయింట్‌ వచ్చింది. మరో వైపు గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం.. ప్లే ఆ‍ఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌. దీంతో.. ఆ టీమ్‌కు మ్యాచ్‌ జరగడం ఎంతో ముఖ్యంగా. కానీ, మ్యాచ్‌ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి గుజరాత్‌ అధికారికంగా తప్పుకుంది.

ఇక ఈ మ్యాచ్‌ రద్దుతో.. ఆర్సీబీ, డీసీ, లక్నో, చెన్నై జట్లుకు కాస్త మేలు జరగొచ్చు. ఎందుకంటే.. ప్లే ఆఫ్స్‌ కోసం పోటీ పడుతున్న ఓ జట్టు తగ్గితే మిగతా వారికి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం సీఎస్‌కే 14, ఆర్సీబీ 12, డీసీ 12, లక్నో 12 పాయింట్లతో ఉన్నాయి. సీఎస్‌కే, ఆర్సీబీ, డీసీకి ఒక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. కానీ, లక్నోకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. లక్నో ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా.. ఆ జట్టుకు ఉన్న నెట్‌ రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 11 పాయిం‍ట్లతో గుజరాత్‌ ఎలిమినేట్‌ అవ్వడంతో ఈ జట్లకు పోటీ తగ్గింది. మరి కేకేఆర్‌ వర్సెస్‌ జీటీ మ్యాచ్‌ రద్దు అవ్వడంతో ఏ జట్టుకు బాగా కలిసివస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి