iDreamPost

Pushpa : బన్నీ సినిమా ఎన్ని కోట్లు రాబడితే సేఫ్

Pushpa : బన్నీ సినిమా ఎన్ని కోట్లు రాబడితే సేఫ్

రేపు పుష్ప రిలీజ్ కు సర్వం సిద్ధమయ్యింది. కోర్టు వ్యవహారం వల్ల ఏపిలో ఇంకా చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. బెనిఫిట్ షోలు ఉంటాయా లేదానే క్లారిటీ కూడా రాలేదు. మరోవైపు తెలంగాణ, యుఎస్ లో మాత్రం టికెట్ల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈజీగా అఖండను మించే ఓపెనింగ్స్, రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఒక నెల తక్కువ గ్యాప్ రెండేళ్ల తర్వాత వస్తున్న అల్లు అర్జున్ సినిమా కావడంతో అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అందులోనూ అటవీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ అవ్వడం వల్ల అంచనాలు ఇంకా పెరిగాయి. మంచి టాక్ వస్తే చాలు దూసుకుపోవడమే.

ఇక బిజినెస్ సంగతి చూస్తే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే పుష్ప 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నట్టు సమాచారం. నైజామ్ అత్యధికంగా 36 కోట్లకు అమ్ముడుపోగా వైజాగ్ ఏరియా ఒకటే 12 కోట్లకు పైగానే పలికింది. సీడెడ్ నుంచి 18 కోట్ల దాకా బయ్యర్లు ఆఫర్ ఇచ్చారు. ఈస్ట్ వెస్ట్ కలిపి 15 కోట్లు, కృష్ణ 7.5 కోట్లు, గుంటూరు 9 కోట్ల పైచిలుకు, నెల్లూరు 4 కోట్ల దాకా డిస్ట్రిబ్యూటర్లు పుష్ప మీద పెట్టుబడి పెట్టినట్టు వార్త. ఇక కన్నడ వెర్షన్ 9 కోట్లు, తమిళం 6 కోట్లు, మలయాళం 4 కోట్లు, హిందీతో సహా ఇతర ప్రాంతాలు 11 కోట్ల దాకా అమ్మేసినట్టు చెబుతున్నారు. ఓవర్సీస్ లో 13 కోట్ల దాకా రాబట్టినట్టు వినికిడి. మొత్తం 150 కోట్ల దాకా ఉండొచ్చు.

పుష్ప లాభాల్లోకి ప్రవేశించాలంటే కనీసం 155 కోట్లు వసూలు కావాలి. ఇది పెద్ద మొత్తమే. సంక్రాంతి కాని సీజన్ లో ఇంత మొత్తం రాబట్టడం అంత సులభం కాదు. చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు విపరీతమైన టెన్షన్ పెట్టినప్పటికీ సుకుమార్ టీమ్ ఫైనల్ గా వాటిని దాటేసింది. తమిళనాడు నగరాల్లో ఉదయం 5 నుంచే షోలు వేస్తున్నారు. అమెరికాలో అర్ధరాత్రి 12 నుంచే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. బాగానే ఉందన్న మాట చాలు పుష్ప ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. అఖండ స్లో అయ్యింది కాబట్టి బన్నీ ఆ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో వేచి చూడాలి. ఇవాళ సాయంత్రం దర్శకుడు సుకుమార్ మీడియాతో కలవనున్నట్టు తెలిసింది

Also Read : Liger Release : విజయ్ దేవరకొండ గ్యాప్ ఇంకా పెరిగింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి