iDreamPost
android-app
ios-app

Pat Cummins: అప్పుడు వార్నర్.. ఇప్పుడు కమ్మిన్స్..పోకిరి, పుష్ప డైలాగ్స్ తో అదరగొట్టాడు! వీడియో వైరల్..

  • Published Apr 24, 2024 | 11:37 AM Updated Updated Apr 24, 2024 | 11:37 AM

పోకిరి, పుష్ప డైలాగ్స్ తో అదరగొట్టాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అప్పుడు వార్నర్.. ఇప్పుడు కమ్మిన్స్ తెలుగు సినిమా సూపర్ హిట్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పోకిరి, పుష్ప డైలాగ్స్ తో అదరగొట్టాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అప్పుడు వార్నర్.. ఇప్పుడు కమ్మిన్స్ తెలుగు సినిమా సూపర్ హిట్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Apr 24, 2024 | 11:37 AMUpdated Apr 24, 2024 | 11:37 AM
Pat Cummins: అప్పుడు వార్నర్.. ఇప్పుడు కమ్మిన్స్..పోకిరి, పుష్ప డైలాగ్స్ తో అదరగొట్టాడు! వీడియో వైరల్..

ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపే ఆటతీరుతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. రికార్డులను బద్దలు కొట్టుడే లక్ష్యంగా SRH బ్యాటర్లు రెచ్చిపోతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా భారీ స్కోర్లు సాధించి.. ఐపీఎల్ రికార్డులను తిరగరాస్తున్నారు. ఇక తమ నెక్ట్స్ మ్యాచ్ ఏప్రిల్ 25న ఆర్సీబీతో ఆడనున్నారు. ఈ క్రమంలో SRH కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మయాంక్ అగర్వాల్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసిన విషయం తెలిసిందే. ఇక వారి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్ ని కలిసిన తర్వాత పోకిరి, పుష్ప తెలుగు డైలాగ్స్ ను కమ్మిన్స్ అద్భుతంగా చెప్పాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను తన కెప్టెన్సీలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ప్యాట్ కమ్మిన్స్. ఇక ఈ సీజన్ లో ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్ లో ఉంది. ఇక తన తదుపరి మ్యాచ్ లో ఆర్సీబీని ఢీకొనబోతోంది. సొంత గడ్డపై మరోసారి దుమ్మురేపాలని భావిస్తోంది హైదరాబాద్ టీమ్. ఈ క్రమంలో SRH ప్లేయర్లు సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసిన విషయం తెలిసిందే. ప్రిన్స్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కమ్మిన్స్. మహేశ్ తో సమయం గడపడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

అయితే దీని తర్వాత ప్యాట్ కమ్మిన్స్ మహేశ్ బాబు మూవీ పోకిరి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం పుష్ఫ డైలాగ్స్ తో అదరగొట్టాడు. అచ్చమైన తెలుగులో సూపర్ హిట్ డైలాగ్స్ చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. “ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను, కమ్మిన్స్ అంటే క్లాస్ కాదు.. మాస్, ఊర మాస్, SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్” అంటూ చివర్లో పవన్ కళ్యాణ్ మేనరిజంతో ముగించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కాగా.. గతంలో సన్ రైజర్స్ కు ఆడిన డేవిడ్ వార్నర్ సైతం మహేశ్, బన్నీ డైలాగ్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. మరి మహేశ్, బన్నీ డైలాగ్స్ తో దుమ్మురేపిన ప్యాట్ కమ్మిన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet