iDreamPost
android-app
ios-app

Dil Raju: దిల్ రాజుకి అందని.. ప్రభాస్ రాజు గారు! డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు?

  • Published Mar 16, 2024 | 1:04 PM Updated Updated Mar 16, 2024 | 1:04 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాత ఎవరంటే ముందుగా వినిపించే పేరు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అయితే, దిల్ రాజు .. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై .. పాన్ ఇండియా మూవీస్ చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు ఆ సినిమాల ఊసే లేదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాత ఎవరంటే ముందుగా వినిపించే పేరు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అయితే, దిల్ రాజు .. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై .. పాన్ ఇండియా మూవీస్ చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు ఆ సినిమాల ఊసే లేదు.

  • Published Mar 16, 2024 | 1:04 PMUpdated Mar 16, 2024 | 1:04 PM
Dil Raju: దిల్ రాజుకి అందని.. ప్రభాస్ రాజు గారు! డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సంఖ్య, ఆ సినిమాల మీద ఉండే ఎక్స్పెక్టషన్స్ ప్రతి ఏడాదికి పెరిగిపోతున్నాయి. ఒక సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలంటే ఖచ్చితంగా .. ఆ సినిమాలకు భారీ బడ్జెట్ ను కేటాయించాల్సిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాతలలో ఒకరైన.. దిల్ రాజు.. గతంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద.. పాన్ ఇండియా సినిమాలను, బిగ్ స్కేల్ మూవీస్ ను చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ..ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని 200కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు దిల్ రాజు. అయితే, దీనికంటే ముందు దిల్ రాజు ఇండియన్ 2 మూవీని టేక్ అప్ చేయాలనుకున్నాడు. కానీ, కొన్ని కారణాల వలన .. గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ను డీల్ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు దాదాపు గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు సిద్దంగానే ఉంది. అనుకున్న ప్రకారం షూటింగ్ కంప్లీట్ అయితే, ఈ ఏడాది గేమ్ ఛేంజర్ ను విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత.. ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా.. జటాయు మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్ సుమారు 100 కోట్లని ప్రకటించారు. దీనితో పాటు శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ..  పిరియాడికల్ ఫిక్షనల్ మూవీని.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రశాంత్ నీల్,ప్రభాస్ కాంబినేషన్ లో రాబోయే .. ఓ మైథలాజికల్ ఫిక్షనల్ మూవీని కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాలన్నీ దిల్ రాజు చెప్పి సుమారు రెండేళ్లు అయిపోతుందని. కానీ, ఇప్పటివరకు ఈ సినిమాలపై ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. దిల్ రాజు సైడ్ నుంచి కూడా  వీటి గురించి ఎటువంటి టాక్ లేకపోవడంతో.. అభిమానులలో కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

Prabhas

అయితే, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తీస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికి ఈ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తున్నా కూడా.. విడుదల తర్వాత టాక్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇక ఇంద్రగంటి విషయానికొస్తే.. ఇప్పటికే ఇంద్రగంటి-విజయ్ కాంబినేషన్ లో లైగర్, ఖుషి సినిమాలతో ప్రెసెంట్ యావరేజ్ టాక్స్ సంపాదించుకుంటున్నాడు. దీనితో ఫ్యామిలీ స్టార్ తర్వాత .. ఇప్పట్లో దిల్ రాజు వీరి సినిమాలు తీసే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఇక శైలేష్ కొలను సైంధవ్ తో సక్సెస్ కాలేకపోయాడు. ఇవి కాకుండా.. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రావడానికి కనీసం.. రెండు, మూడేళ్ళు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయినా ప్రాజెక్ట్స్ చేయడానికి మినిమమ్ మూడేళ్లు పడుతుంది. సో ఈ లెక్కన చూస్తే దిల్ రాజు ప్రకటించిన పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదంటూ.. అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş