iDreamPost

రైల్వేలో గ్రూప్ సి, డి ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిసెంబర్ 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? పూర్తి వివరాలు మీ కోసం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిసెంబర్ 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? పూర్తి వివరాలు మీ కోసం..

రైల్వేలో  గ్రూప్ సి, డి ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ప్రజా, వస్తు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది భారతీయ రైల్వే. రోజు వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. సిబ్బంది కొరత లేకుండా రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నోటిఫికషన్లను ఇండియన్ రైల్వే విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పశ్చిమ రైల్వే గ్రూప్ సి, డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

పశ్చిమ రైల్వే నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ సి – 21 పోస్టులు, గ్రూప్ డి – 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ గ్రూప్ సి, డి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10 నుండి ప్రారంభమవగా 19 డిసెంబర్ 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు 12వ (10+2) తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా 10వ తరగతి తర్వాత అప్రెంటీస్ కోర్సు లేదా ITI సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయడం తప్పనిసరి. పూర్తి వివరాలకు అభ్యర్థులు పశ్చిమ రైల్వే rrc-wr.com అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం

గ్రూప్ సి – 21 పోస్టులు

గ్రూప్ డి – 43 పోస్టుల

విద్యార్హతలు

టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ

వయోపరిమితి

01/01/2024 నాటికి 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు.

అప్లికేషన్ ఫీజు

రూ.500 అప్లికేషన్ ఫీజు. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన అభ్యర్థులకు రూ.400 తిరిగి చెల్లించబడుతుంది.

ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు/వికలాంగులు/మహిళలు/మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ

10-11-2023

దరఖాస్తుకు చివరి తేదీ

19-12-2023

అధికారిక వెబ్ సైట్

rrc-wr.com

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి