iDreamPost
android-app
ios-app

ఇండియా, ఆస్ట్రేలియా కాదు.. టీ20 కప్పు కొట్టేది ఆ జట్టే! వాళ్లది ఆట కాదు వేట!

  • Published May 31, 2024 | 3:50 PMUpdated Jun 01, 2024 | 8:22 AM

West Indies, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ఓ జట్టు ఆడిన ఆట చూస్తే ప్రత్యర్థుల గుండెళ్లో బుల్లెట్‌ రైళ్లు పరిగెత్తాల్సిందే. ఇండియా, ఆస్ట్రేలియా కాదు.. అసలైన హాట్‌ ఫేవరేట్లు వీళ్లే అని ఎవరైనా చెప్పాలిందే. మరి అంతటి విధ్వంసం సృష్టించిన, సృష్టించగల టీమ్‌ ఏదో ఇప్పుడు చూద్దాం..

West Indies, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ఓ జట్టు ఆడిన ఆట చూస్తే ప్రత్యర్థుల గుండెళ్లో బుల్లెట్‌ రైళ్లు పరిగెత్తాల్సిందే. ఇండియా, ఆస్ట్రేలియా కాదు.. అసలైన హాట్‌ ఫేవరేట్లు వీళ్లే అని ఎవరైనా చెప్పాలిందే. మరి అంతటి విధ్వంసం సృష్టించిన, సృష్టించగల టీమ్‌ ఏదో ఇప్పుడు చూద్దాం..

  • Published May 31, 2024 | 3:50 PMUpdated Jun 01, 2024 | 8:22 AM
ఇండియా, ఆస్ట్రేలియా కాదు.. టీ20 కప్పు కొట్టేది ఆ జట్టే! వాళ్లది ఆట కాదు వేట!

క్రికెట్‌ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. జూన్‌ 2న పొట్టి ప్రపంచ కప్‌ పోటీలు షురూ కాబోతున్నాయి. అయితే.. ఈ మెగా టోర్నీకి ముందు ఫలానా జట్టు ఫేవరేట్‌ అని, లేదు ఆ రెండు టీమ్స్‌లో ఒక టీమ్‌ కప్పు కొడుతుందంటూ.. క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా తమ అంచనాలను వెల్లడిస్తుంటారు. ఇప్పటి వరకు చాలా మంది ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్‌ ఈ వరల్డ్‌ కప్‌లో హాట్‌ ఫేవరేట్‌ అంటూ పేర్కొన్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ను ఇప్పటికే ఒక్కోసారి గెలిచి ఉన్నాయి ఈ రెండు టీమ్స్‌. అయితే ప్రస్తుతం ఈ రెండు టీమ్స్‌ ఉన్న ఫామ్‌ను బట్టి.. క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇండియా, ఆస్ట్రేలియాలో ఒక టీమ్‌ కప్పు కొడుతుందని అంటున్నారు. అయితే.. ఈ రెండు టీమ్స్‌ను మించి.. టీ20 క్రికెట్‌కే డాన్‌ లాంటి ఓ టీమ్‌ అసలు సిసలు ఫేవరేట్‌గా ఉంది. ఆ టీమ్‌ ఏది? ఎందుకు ఇండియా, ఆస్ట్రేలియా ఇండియాను మించి ఫేవరేటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో చాలా మంది వెస్టిండీస్‌ జట్టును ఫేవరేట్స్‌ లిస్ట్‌లో పెట్టుకోలేదు. కనీసం సెమీస్‌ చేరే నాలుగు టీమ్స్‌లో కూడా ఉంటుందని ఏ మాజీ క్రికెటర్‌ కూడా చెప్పలేదు. కానీ, కప్పు కొట్టే సత్తా మాత్రం ఆ టీమ్‌కే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కరేబియన్‌ క్రికెటర్లు టీ20 క్రికెట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ ఏ మూలన టీ20 క్రికెట్‌ లీగ్‌ జరిగినా.. అదరగొట్టేది కరేబియన్ క్రికెటర్లు. టీ20 క్రికెట్‌ వారి విధ్వంసకర ఆటకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. అందుకే ఐపీఎల్‌, బీపీఎల్‌, పీఎస్‌ఎల్‌, ది హండ్రెడ్‌, ఎల్‌పీఎల్‌, ఐఎల్‌టీ20, ఎస్‌ఏటీ20 ఇలా లీగ్‌ ఏదైనా.. హవా మాత్రం వెస్టిండీస్‌ క్రికెటర్లతే. కానీ, గతంలో బోర్డుకు ఆటగాళ్లకు మధ్య విభేదాల కారణంగా.. చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరం అయ్యారు. అందుకే వెస్టిండీస్‌ టీమ్‌ బలహీనపడింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు జట్టులోకి తిరిగొచ్చారు. గతంలో కుర్రాళ్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు చిచ్చరపిడుగులయ్యారు.

షై హోప్‌, ఛార్లెస్‌, పూరన్‌, రోవ్‌మన్‌ పొవెల్‌, హేట్‌ మేయర్‌, రుథర్‌ఫర్డ్‌, బ్రెండన్‌ కింగ్‌, ఆండ్రీ రస్సెల్‌, అకెలా హుస్సేన్‌, షెఫర్డ్‌, షమర్‌ జోసెఫ్‌, అల్జారీ జోసెఫ్‌ ఇలా వెస్టిండీస్‌ టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ మొత్తం టీ20 స్టార్లతో కళకళలాడుతోంది. వారిలో ఏ ముగ్గురు నిలబడినా.. ప్రపంచంలో మరే టీమ్‌ వాళ్లను ఓడించలేదు. వాళ్ల విధ్వంసకర బ్యాటింగ్‌ ముందు.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా.. ఏ బౌలింగ్‌ కూడా నిలువలేదు. ఇంత విధ్వంసకర టీమ్‌లో ఇంకా సునీల్‌ నరైన్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్‌ లేడు.. అతను కూడా ఉండి ఉంటే.. టోర్నీ ఆడకుంటానే.. కప్పు వాళ్ల చేతుల్లో పెట్టి వచ్చేయొచ్చు. పైగా వెస్టిండీస్‌ గురించి ఇంత బలంగా క్రికెట్‌ నిపుణులు చెప్పడానికి కారణం.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో కూడా జరుగనున్నాయి. వాళ్ల గడ్డపై కరేబియన్లు మరింత డేంజరస్‌గా మారతారు.

పైగా టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వామప్‌ మ్యాచ్‌ చూస్తేనే అర్థం అవుతుంది.. వరల్డ్‌ కప్‌ ముందు కరేబియన్లు ఎంత కసిగా ఉన్నారో. గురువారం పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవెల్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు విధ్వంసం సృష్టించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 257 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛార్లెస్‌ 31 బంతుల్లో 40, పూరన్‌ 25 బంతుల్లో 75, పొవెల్‌ 25 బంతుల్లో 52, రుథర్‌ఫర్డ్‌ 18 బంతుల్లో 47 పరుగులు చేసి.. ఆసీస్‌ బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టారు. ఆస్ట్రేలియా పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే.. ఇక మిగతా టీమ్స్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అసలు సిసలైన హాట్‌ ఫేవరేట్‌ వెస్టిండీస్‌ టీమ్‌ అని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి