SNP
Weather Report, Hyderabad, SRH vs LSG: ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం గండం ఉంటుందా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారి కోసమే ఈ వార్త..
Weather Report, Hyderabad, SRH vs LSG: ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం గండం ఉంటుందా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారి కోసమే ఈ వార్త..
SNP
ఈ సీజన్లోనే అత్యంత కీలకమైన మ్యాచ్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కి ముందు భారీ వర్షం రావడంతో.. బుధవారం జరగబోయే మ్యాచ్ జరుగుతుందా? లేక రద్దు అవుతుందా అనే టెన్షన్ అభిమానుల్లో ఏర్పడింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ఇంపార్టెంట్. ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు పోటీ పడుతున్న ఈ రెండు టీమ్స్ ఈ మ్యాచ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మ్యాచ్ రద్దు అయితే.. చెరో పాయింట్ వస్తుంది. అది రెండు టీమ్స్ కూడా నష్టం చేస్తుంది. అందుకే మ్యాచ్ జరగాలని రెండు టీమ్స్ బలంగా కోరుకుంటున్నాయి. మరి మంగళవారం హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తడంతో.. బుధవారం మ్యాచ్ సాధ్యపడుతుందా లేదా అనే విషయం గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బుధవారం వర్షం వచ్చే సూచనలు పెద్దగా లేవని ప్రకటించింది. దీంతో.. మంగళవారం వర్షానికి గ్రౌండ్ కాస్త తడిసి ఉన్నా.. బుధవారం మ్యాచ్ సమయానికి గ్రౌండ్ రెడీ అయిపోతుంది. దీంతో.. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడం ఖాయం. అయితే.. ఈ మ్యాచ్ న్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ ఎంతో కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ కూడా 11 మ్యాచ్‌లు ఆడి.. ఆరేసి విజయాలతో 12 పాయింట్లతో ఉన్నాయి. సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో, లక్నో ఐదో స్థానంలో ఉంది. సేమ్ పాయింట్లు ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌తో ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానంలో నిలిచింది.
రెండు జట్లు కూడా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్‌రేట్‌తో కచ్చితంగా రెండు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఏ టీమ్ విజయం సాధిస్తే వారికే ప్లే ఆఫ్స్ ఛాన్సులు అధికంగా ఉంటాయి. ఎస్ఆర్హెచ్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే తర్వాతి మ్యాచ్‌ల్లో గుజరాత్, పంజాబ్‌తో హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ రెండు టీమ్స్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. పైగా సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్‌గా మారనుంది. కానీ లక్నో పరిస్థితి వేరేలా ఉంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ తర్వాత ఢిల్లీ, ముంబైతో ఆడాలి. ఆ రెండు టీమ్స్ ఇప్పుడు చాలా డేంజర్‌గా ఆడుతున్నాయి. అందుకే ఎస్ఆర్హెచ్పై ఎలాగైనా గెలిచి తీరాలని లక్నో భావిస్తోంది. అందుకే సన్‌రైజర్స్, లక్నో మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఈ మ్యాచ్‌కు వర్ష గండం లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The 𝘁𝗼𝗿𝗰𝗵-𝗯𝗲𝗮𝗿𝗲𝗿 of our #PlayWithFire spirit 🔥
Happy birthday, skip 🥳🧡 pic.twitter.com/tojhGQtaUH
— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024