iDreamPost

లైఫ్ సెట్ అయ్యే Govt జాబ్స్.. ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ సాధిస్తే లైఫ్ లో సెట్ అయి పోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ సాధిస్తే లైఫ్ లో సెట్ అయి పోవచ్చు.

లైఫ్ సెట్ అయ్యే Govt జాబ్స్.. ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి

గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే చాలదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంటుంటారు. అయితే ప్రయత్నం చేయడం మాత్రం వదలొద్దు. మీ లక్ష్యం పట్ల మీరు పెట్టే డెడికేషన్.. కృషి లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి తోడ్పడతాయి. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం అంత సులువైన పనేమీ కాదు. దాని కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. లైఫ్ సెట్ అయ్యే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో 275 పోస్టుల భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీకాం ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ-మెయిల్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 26 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం ఖాళీలు – 275
  • టీమ్ లీడర్ పోస్టులు: 1
  • డిప్యూటీ టీమ్ లీడర్/ రెసిడెంట్ ఇంజినీర్ పోస్టులు : 2
  • సీనియర్ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 2
  • సీనియర్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు : 2
  • సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు : 2
  • సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ పోస్టులు : 2
  • సివిల్ ఇంజినీర్ పోస్టులు : 16
  • మెకానికల్ ఇంజినీర్ పోస్టులు : 8
  • ఎలక్టికల్ ఇంజినీర్ పోస్టులు : 4
  • అకౌంటెంట్ పోస్టులు : 2
  • టీమ్ లీడర్ పోస్టులు : 1
  • సీనియర్ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 6
  • క్యూసీ ఇంజినీర్‌ పోస్టులు : 8
  • ఇంటర్మీడియట్ లెవెల్‌ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 37
  • జూనియర్ లెవల్ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 182

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 31-03-2024 నాటికి 55 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా:

  • wapcos1maf@yahoo.com

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 26-04-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి