Nidhan
పాకిస్థాన్ జట్టు కథ ముగిసింది. టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే దాయాది ఇంటిదారి పట్టింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు పాక్ ప్లేయర్లు.
పాకిస్థాన్ జట్టు కథ ముగిసింది. టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే దాయాది ఇంటిదారి పట్టింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు పాక్ ప్లేయర్లు.
Nidhan
పాకిస్థాన్ జట్టు కథ ముగిసింది. టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే దాయాది ఇంటిదారి పట్టింది. మొదటి మ్యాచ్‌లో పసికూన అమెరికా చేతిలో ఓడింది పాక్. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఆ మ్యాచ్‌లో బాబర్ సేనకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఫేవరెట్ టీమిండియా చేతుల్లో పరాజయం పాలైంది. అనంతరం కెనడా మీద విజయం సాధించింది. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. భారత్, యూఎస్ఏలు సూపర్-8కు క్వాలిఫై అయిపోయాయి. దీంతో ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఆడాల్సిన పాక్.. దీని రిజల్ట్‌తో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఒకవేళ ఇందులోనూ ఓడిపోతే మరిన్ని విమర్శలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ టీమ్‌పై భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇంత చెత్త జట్టు ఏంట్రా బాబు అంటూ విమర్శకులు ఏకిపారేస్తున్నారు.
ఎన్నో అంచనాలు పెట్టుకుంటే అన్నీ వమ్మవడంతో పాక్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇంత వరస్ట్‌గా ఆడటాన్ని ఎప్పుడూ చూడలేదంటూ దుయ్యబడుతున్నారు. పాక్ ఫెయిలైనా వెనకేసుకొచ్చే ఆ దేశ మాజీలు కూడా సొంత టీమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెజెండ్ వసీం అక్రమ్ కామెంట్సే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. యూఎస్ఏ సూపర్-8కు క్వాలిఫై అయిందని, ఆ దశకు చేరుకోవడానికి అమెరికాకు పూర్తిగా అర్హత ఉందన్నాడు. వాళ్లు పాకిస్థాన్‌ను ఓడించారని తెలిపాడు. ఇప్పుడు పాక్ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించాడు. తన దృష్టిలో ఓ ఫ్లైట్ పట్టుకొని దుబాయ్‌కు, అటు నుంచి ఆటగాళ్లు ఎవరి సిటీకి వాళ్లు వెళ్లిపోవడం తప్ప ఇంక చేసేదేమీ లేదంటూ పాక్ పరువు తీశాడు అక్రమ్.
‘యూఎస్ఏ అద్భుతంగా ఆడుతోంది. ఆ టీమ్‌కు కంగ్రాట్స్. వాళ్లు పాకిస్థాన్‌ను ఓడించారు. క్రికెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు సంపాదిస్తోంది. ఈ గేమ్ గ్లోబలైజ్ అవుతోంది. అందుకు అమెరికా జట్టు సూపర్-8కు చేరుకోవడమే పెద్ద ఉదాహరణ. ఆ దశకు చేరుకోవడానికి యూఎస్ఏకు పూర్తి అర్హత ఉంది. ఆ టీమ్ ప్లేయర్లు ఎంతో శ్రమించారు. అందుకే ఈ స్థాయిలో ఉన్నారు. పాక్ ఆటగాళ్లకు ఇప్పుడో పని చేయాలి. ఒక ఫ్లైట్ పట్టుకొని దుబాయ్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి తమ ఇళ్లకు వెళ్లిపోవాలి’ అని అక్రమ్ ట్రోల్ చేశాడు. పాక్‌కు సపోర్ట్‌గా ఉంటూ, తప్పొప్పులను సరిదిద్దుతూ, ఆ టీమ్‌ను వెనకేసుకొచ్చే అక్రమ్ ఈ స్థాయిలో విమర్శించడంతో అంతా షాక్ అవుతున్నారు. దాయాది జట్టు చెత్తాట వల్లే అక్రమ్ ఈ స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని, అతడు అన్నదాంట్లో తప్పేమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అక్రమ్ పాక్ పరువు తీస్తూ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Wasim Akram said – “USA qualified for the Super 8s, They deserve to be there, They’ve beaten Pakistan – For Pakistan, what’s the plan?, EK 601 flight to Dubai and then to the respective cities”. (ICC). pic.twitter.com/GZ2JeacFGq
— Tanuj Singh (@ImTanujSingh) June 15, 2024