iDreamPost
android-app
ios-app

World Cup 2023: నా కంటే ఆ భారత కుర్రాడే మంచి బౌలర్‌: వసీం అక్రమ్‌

  • Published Oct 30, 2023 | 4:46 PM Updated Updated Oct 30, 2023 | 4:46 PM

పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌.. తాజాగా ఓ భారత బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కంటే కూడా అతనే మంచి బౌలర్‌ అంటూ కితాబిచ్చాడు. మరి అక్రమ్‌ మనసు గెల్చుకుని, తనకంటే మంచి బౌలర్‌ అని తననోటి నుంచే చెప్పించుకున్న ఆ బౌలర్‌ ఎవరో ఇప

పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌.. తాజాగా ఓ భారత బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కంటే కూడా అతనే మంచి బౌలర్‌ అంటూ కితాబిచ్చాడు. మరి అక్రమ్‌ మనసు గెల్చుకుని, తనకంటే మంచి బౌలర్‌ అని తననోటి నుంచే చెప్పించుకున్న ఆ బౌలర్‌ ఎవరో ఇప

  • Published Oct 30, 2023 | 4:46 PMUpdated Oct 30, 2023 | 4:46 PM
World Cup 2023: నా కంటే ఆ భారత కుర్రాడే మంచి బౌలర్‌: వసీం అక్రమ్‌

వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఎదురేలేదు. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయాలు సాధిస్తోంది. ఈ వరల్డ్‌ కప్‌లో ప్రస్తుతం 6 విజయాలు 12 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న టీమిండియా దాదాపు సెమీస్‌ చేరినట్లే. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ లాంటి పెద్ద టీమ్స్‌పై విజయం సాధించిన టీమిండియా.. ఆఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న టీమ్స్‌ను కూడా ఓడించింది. తాజాగా ఇంగ్లండ్‌ లాంటి పటిష్టమైన జట్టును ఓడించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ అంత మంచి ఫామ్‌లో లేకపోయినా.. ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో గట్టి పోటీనే ఇచ్చింది.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా గెలిచిన మ్యాచ్‌లన్నీ ఛేజింగ్‌ చేస్తూ గెలిచనవే. తొలి సారి ఇండియా, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే తొలుత బ్యాటింగ్‌ చేసి గెలిచింది. అయితే టాస్‌ కీలకంగా మారిన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ ఓడిపోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. పిచ్‌ పరిస్థితులను అనుకూలంగా మల్చుకుంటూ.. ఇంగ్లండ్‌ పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న టీమిండియాను కేవలం 229 పరుగులకే కట్టడిచేసి.. మ్యాచ్‌లో మంచి పట్టు సాధించారు. పైగా రెండో ఇన్నింగ్స్‌ సమయంలో డూవ్‌ కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్‌దే అనుకున్నారు చాలామంది.

కానీ, టీమిండియా పేస్‌ దళం.. జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ నిప్పులు చెరిగారు. మరో జెమ్‌ లాంటి బౌలర్‌ సిరాజ్‌ అంత ఎఫెక్టీవ్‌గా అనిపించకపోవడంతో కెప్టెన్‌ రోహిత్‌ వెంటనే బౌలింగ్‌లో మార్పు చేసి.. షమీని ఎటాక్‌లోకి తెవడం కలిసొచ్చింది. రెండు వైపులా సూపర్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ కోలుకోకుండా దెబ్బ తీసి.. బుమ్రా 3, షమీ 4, కుల్దీప్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ 129 పరుగులకే ఆలౌట్‌ చేసి, టీమిండియాకు విజయం అందించారు. ఈ మ్యాచ్‌లో షమీతో పాటు బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ అనే కాదు ప్రతి మ్యాచ్‌లోనే బుమ్రా సూపర్‌గా బౌలింగ్‌ చేస్తున్నాడు. దీంతో బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్థాన్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌, కెప్టెన్‌ వసీం అక్రమ్‌ బుమ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. తన కంటే కూడా బుమ్రా కొత్త బంతిపై అద్భుతమైన కంట్రోల్‌ కలిగి ఉన్నాడంటూ కితాబిచ్చాడు. మరి వసీం అక్రమ్‌ లాంటి లెజెండరీ క్రికెటర్‌ బుమ్రాను ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.