SNP
Wasim Akram, Rishabh Pant: ఓ టీమిండియా క్రికెటర్ గురించి.. పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ‘మిరాకిల్ పిల్లోడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఎవరి గురించి అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Wasim Akram, Rishabh Pant: ఓ టీమిండియా క్రికెటర్ గురించి.. పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ‘మిరాకిల్ పిల్లోడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఎవరి గురించి అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సూపర్ 8లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌కు రెడీ అయింది. గురువారం బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల ఫోకస్ మొత్తం ఈ మ్యాచ్‌పైనే ఉంది. అలాగే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌ను అందుకుంటాడా? లేదా? అని కూడా భారత క్రికెట్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఓ భారత క్రికెటర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనో మిరాకిల్ కుర్రాడు అంటూ పేర్కొన్నాడు. ఇంతకీ అక్రమ్ ఎవరి గురించి మాట్లాడంటే.. మన పాకెట్ డైనమైట్ రిషభ్ పంత్ గురించి.
వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘పంత్ ఎలా ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. అతనో మిరాకిల్ పిల్లాడు, తానో సూపర్ హ్యూమన్ అనే విషయాన్ని అతను నిరూపించాడు. రిషభ్ పంత్‌కు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఆ విజువల్స్ చూశాను.. ఆ సమయంలో తాను పాకిస్థాన్‌లో ఉన్నాను. ఆ విజువల్స్ చూసి చాలా కంగారు పడ్డాను. కానీ, పంత్ తానో సూపర్ హ్యూమన్ అనే విషయాన్ని యాక్సిడెంట్ తర్వాత నిరూపిస్తున్నాడు. పంత్ ఇలా ఆడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని అక్రమ్ పేర్కొన్నాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్ 2024లో పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే వికెట్ కీపింగ్‌లో కూడా చాలా మెరుగ్గా కదులుతున్నాడు. పంత్.. ఈ టీ20 వరల్డ్ కప్ కంటే ముందే బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రీఎంట్రీ ఇచ్చిన పంత్.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అంచనాలకు మించి రాణించాడు. పెద్ద యాక్సిడెంట్ నుంచి అంటే దాదాపు చావు నుంచి తప్పించుకుని.. ఏడాది పాటు ఆటకు దూరమై.. కోలుకొని తిరిగి గ్రౌండ్‌లోకి దిగి.. మునుపటి ప్రదర్శనను కనబర్చడం అంటే మాటలు కాదు. పంత్ యాక్టివ్‌గా ఆడితే చాలు.. ఇంతకు ముందు ఉన్నంత అగ్రెషన్ లేకపోయినా పర్వాలేదని డీసీ మేనేజ్‌మెంట్ కూడా భావించింది. కానీ, పంత్ అంతకుమించి రాణిస్తున్నాడు. అందుకే వసీం అక్రమ్ మిరాకిల్ పిల్లాడు అంటూ పేర్కొన్నాడు. మరి పంత్‌పై అక్రమ్ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Woh miracle bachcha hai’: Wasim Akram on Rishabh Pant’s comeback to cricket after horrific accident pic.twitter.com/8qlLc10HRv
— Sayyad Nag Pasha (@nag_pasha) June 20, 2024