iDreamPost

బీఆర్ఎస్ కి మరో షాక్.. వరంగల్‌ MP పోటీ నుంచి తప్పుకున్న కావ్య!

Big Shock for BRS: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవడానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు గట్టి పట్టుమీద ఉన్నాయి.

Big Shock for BRS: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవడానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు గట్టి పట్టుమీద ఉన్నాయి.

బీఆర్ఎస్ కి మరో షాక్.. వరంగల్‌ MP పోటీ నుంచి తప్పుకున్న కావ్య!

గత ఏడాది చివరల్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది.  తాజాగా బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలవాలని బీఆర్ఎస్ గట్టి పట్టు మీద ఉంది. కానీ గత కొన్ని రోజులుగా వరుసగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్నారు. తాజాగా బీర్ఎస్ కి మరో ఊహించని షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ స్థానం పోటీ నుంచి కడియం కావ్య తప్పుకున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మూడు రోజుల క్రితమే ఆమె మాజీ సీఎం కేసీఆర్ ని కలిశారు. కానీ ఆమె అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ ఎంపీ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కేసీఆర్ కి ఆమె లేఖ ద్వారా తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభ కోణాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య సరైన సమన్వయం లేదు. దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని, అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు.. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్, కార్యకర్తలు నన్ను క్షమించాలని’ లేఖలో పేర్కొన్నారు కడియం కావ్వ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి