iDreamPost
android-app
ios-app

అత్తా కోడళ్ల మధ్య గొడవ, చివరికి భర్త మృతి!

  • Published Oct 13, 2023 | 1:42 PM Updated Updated Oct 13, 2023 | 1:42 PM
  • Published Oct 13, 2023 | 1:42 PMUpdated Oct 13, 2023 | 1:42 PM
అత్తా కోడళ్ల మధ్య గొడవ, చివరికి భర్త మృతి!

ప్రతీ కుటుంబంలో అప్పుడప్పడు గొడవలు జరగడం సహజం. మాట్లాడుకుంటే సమిసిపోయే దానికి.. కొందరు వ్యక్తులు పరిష్కారం లేదని భావించి ఉన్నట్టుండి సంచలనం నిర్ణయం తీసుకుంటుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ వ్యక్తి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఏ విషయంలో గొడవ జరిగింది? అసలు భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా వెంకటాపురంలో ఇజ్జగిరి సతీష్-లిఖిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే సతీష్ దామెర తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, సతీష్ తల్లిదండ్రులు కూడా ఇతనితో పాటే ఉండేవారు. కాగా, ఇతని తల్లి లక్ష్మి, భార్య లిఖిత తరుచు గొడవ పడేవారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. భర్త సతీష్ వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ, వాళ్లు మాత్రం వినలేదు. గొడవ అనంతరం సతీష్ తన కూతురిని తీసుకుని బెడ్ రూంలోకి వెళ్లి పడుకున్నాడు.

అయితే సతీష్ అత్తా కోడళ్ల గొడవ పట్ల తీవ్ర మనస్థాపానికి గురై అదే రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయం కూతురు నిద్రలేచి చూసే సరికి సతీష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసి మృతుని భార్య, తల్లి షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం సతీష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio girişgrandpashabet