iDreamPost
android-app
ios-app

కాజల్ vs పాయల్.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్! అసలు ఏమైందంటే?

  • Published Jun 04, 2024 | 12:44 PM Updated Updated Jun 04, 2024 | 12:44 PM

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఇద్దరు హీరోయిన్ల మధ్య గట్టిగానే కోల్డ్ వార్ జరుగుతుందనే వార్త వినిపిస్తుంది. వారు ఎవరో కాదు కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్ పుత్. వీరిద్దరి మధ్య ఆ విషయంలోనే వార్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఇద్దరు హీరోయిన్ల మధ్య గట్టిగానే కోల్డ్ వార్ జరుగుతుందనే వార్త వినిపిస్తుంది. వారు ఎవరో కాదు కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్ పుత్. వీరిద్దరి మధ్య ఆ విషయంలోనే వార్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

  • Published Jun 04, 2024 | 12:44 PMUpdated Jun 04, 2024 | 12:44 PM
కాజల్ vs పాయల్.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్! అసలు ఏమైందంటే?

గడిచిన నెల సిని ప్రియులకు థియేటర్లలో అన్ని చిన్న చిన్న సినిమాలే సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త నెల ప్రారంభం కావడంతో.. ఈ వారం థియేటర్లలో రిలీజవుతున్న సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వాటిలో శర్వానంద్ ‘మనమే’ సినిమా అగ్రస్థానంలో ఉన్నప్పటికి తమ కంటెంట్ కూడా అడియోన్స్ ను బాగానే మెప్పిస్తుందనే ధీమా ఇతర మూవీ టీంలో కూడా కనిపిస్తోంది. ఇక ఆ సినిమాల విషయానికొస్తే.. ఈసారి స్టార్ హీరోతో పోటోగా ఇద్దరు హీరోయిన్లు బరిలోకి దిగారు. అయితే ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మనం ఇద్దరి హీరోల మధ్య కోల్డ్ వార్ జరగడం చూసి ఉంటాం. కానీ, మొట్ట మొదటిసారి ఇద్దరు హీరోయిన్ల మధ్య ఈ కోల్డ్ వార్ అనేది మొదలైంది. మరి ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్ పుత్. వీరిద్దరూ తాజాగా మొదటిసారి లేడి ఒరియెంటెడ్ మూవీస్ లో నటించారు.

అయితే కాజల్ అగర్వాల్ మొదటిసారిగా ‘సత్యభామ’ అనే టైటిల్ రోల్ పోషించిన సినిమాలో నటించింది. కాగా, ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య ముఖ్య అతిథిగా రావడంతో.. ఈ సినిమా పై మరింత అందరికి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సత్యభామ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇందులో కాజల్ మొదటిసారి కాజల్ అగర్వాల్ ఇందులో ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. అయితే మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో సత్యభామ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉంటే.. మరోవైపు పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన ‘రక్షణ’  సినిమా కూడా అదే రోజు థియేటర్లలో విడుదల కానుంది. కాగా, ఈ సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. అయితే ఈ సినిమా  నాలుగేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ ఇప్పుడు ఆలస్యం రిలీజ్ కానుంది. ఇక ఈ విషయం పై నిర్మాత, పాయల్ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఏ జరిగిందో తెలియదు కానీ, ఎట్టాకేలకు రక్షణ సినిమా కూడా  జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

ఇకపోతే గ్లామరెస్ పాత్రల్లో ఇప్పటి వరకు అలరించిన ఈ బ్యూటీఫుల్ హీరోయిన్స్ ఇప్పుడు మొదటిసారిగా ఖాకీ దుస్తుల్లో వేసుకొని ఎలా మెప్పిస్తారో అనేది చూడాలి. కానీ, ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కాంపిటీషన్ గట్టిగానే ఉందని టాక్ వినిపిస్తుంది. పైగా రెండు సినిమాలు కథ వేరైనా, చూడటానికి ఇద్దరి లుక్స్ ఒకే తరహాలో ఉండటంతో  ఏ సినిమా ఎంత మేరకు అలరిస్తుందో అని అందరూ అభిప్రాయా పడుతున్నారు. అలాగే మరోవైపు ఎన్నికల ఫలితాలు ముగుస్తాయి కాబట్టి, ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్న ఈ రెండు సినిమాల్లో ఈ సినిమా కలెక్షన్స్ కొలగొట్టి, విజయం సాధిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, మొదటిసారి ఇద్దరి హీరోయిన్ల సినిమాలు మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet