iDreamPost

రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్! 3 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ!

గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన ఈ క్రికెటర్ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన ఈ క్రికెటర్ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్! 3 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ!

ఏజ్ మీదపడో లేక అవకాశాలు రాకనో.. తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతుంటారు క్రికెటర్లు. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు సేవలను అందించడానికి రెడీ అవుతుంటారు. తాజాగా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నాడు ఓ స్టార్ ప్లేయర్. గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన ఈ క్రికెటర్ తన డిసిషన్ ను వెనక్కితీసుకున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు వీడ్కోలు పలికాడు? మళ్లీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..

వనిందు హసరంగా.. శ్రీలంక స్టార్ స్పిన్నర్ గా, అచ్చమైన ఆల్ రౌండర్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తాచాటుతూ.. దూసుకెళ్తున్నాడు హసరంగా. అయితే వన్డేలు, టీ20లపైనే ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. కానీ ఇప్పుడు తన రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. మళ్లీ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

The star player who took back the retirement!

కాగా.. బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం అతడిని ఎంపిక చేసింది శ్రీలంక. బంగ్లతో జరగబోయే సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. రిటైర్మెంట్ ఇచ్చే ముందు 2021లో బంగ్లాదేశ్ పైనే చివరి టెస్ట్ ఆడాడు. మరి హసరంగా రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన క్రికెటర్! క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి