iDreamPost

వీడియో: మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన క్రికెటర్! క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ లో డ్రస్సింగ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ.. కెమెరాకంటికి చిక్కాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ లో డ్రస్సింగ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ.. కెమెరాకంటికి చిక్కాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో: మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన క్రికెటర్! క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ప్రారంభం అయిన దగ్గర నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆటగళ్లు గొడవ పడటం దగ్గర నుంచి అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, చెత్త ఫీల్డింగ్ లతో తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది పీఎస్ఎల్. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ఇస్లామాబాద్ ఆటగాడు సిగరెట్ తాగుతూ.. కెమెరా కంటికి చిక్కాడు. దీంతో అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

PSL 2024 ఫైనల్లో ఇస్లామాబాద్ యూనైటెడ్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ తలపడ్డాయి. టైటిల్ పోరులో 2 వికెట్ల తేడాతో ముల్తాన్ జట్టును ఓడించి మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది ఇస్లామాబాద్ జట్టు. ఈ మ్యాచ్ పెద్ద వివాదానికి తెరలేపింది. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి సిగరెట్ తాగాడు పాక్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 159 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ 17.4 వద్ద మ్యాచ్ లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ బౌలర్ నసీమ్ షా బౌలింగ్ చేస్తుండగా.. అప్పటికే 5 వికెట్లు పడగొట్టిన ఇమద్ వసీమ్ షార్ట్ గ్యాప్ లో డ్రెస్సింగ్ రూమ్ వచ్చాడు. అక్కడ సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. 5 వికెట్లు తీసిన సంతోషమో.. లేక ఒత్తిడో తెలీదు కానీ, అతడు ఈ పనికి పాల్పడ్డాడు.

ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. క్రికెట్ లవర్స్ వసీమ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పని బాస్.. కాస్త ముందూ వెనకా చూసుకోవాలి కదా? ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ విమర్శిస్తున్నారు. మ్యాచ్ మధ్యలో ఇలాంటి పాడు పని ఏంటి? చీ.. కొద్దిగైనా బుద్దుండాలి అంటూ మరికొందరు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ టీమ్ 9 వికెట్లకు 159 పరుగులు చేయగా.. 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది ఇస్లామాబాద్ టీమ్. మరి మ్యాచ్ మధ్యలోనే సిగరెట్ తాగిన పాక్ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: శ్రీలంకపై మరోసారి రివేంజ్ తీర్చుకున్న బంగ్లాదేశ్.. ఆపేలాలేరుగా.?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి