iDreamPost

ఆంధ్రజ్యోతి వితండవాదం..

ఆంధ్రజ్యోతి వితండవాదం..

తెల్లకార్డురేషన్‌దారులు అమరావతిలో కోట్లు పెట్టి భూములు కొనడం తప్పెలా అవుతుంది? అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలు అచ్చేస్తోంది. సంతృప్తస్థాయి పేరటి ఎడాపెడా కార్డులను జారీ చేశారని, దీంతో కుదిరిన వాళ్లంతా తీసేసుకున్నారని చెబుతోంది. ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ పలు ప్రయోజనాల కోసమే తెల్లరేషన్‌కార్డును తీసుకున్నారని వాదిస్తోంది. ఇదికాసేపు పక్కన పెడితే.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులకే ప్రభుత్వ పథకాలు అందాలన్న విషయంలో నిజాయతీగా పనిచేస్తోంది. అందుకే ఇన్నాళ్లూ అన్యాయంగా ప్రభుత్వ పథకాలను, రేషన్‌కార్డు ప్రయోజనాలను, పింఛన్లను పొందుతున్న అనర్హులను ఏరివేసి పనిలో పడింది. దీనికోసం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఆ మేరకు అనర్హులకు రేషన్‌కార్డులు, పింఛన్లను తొలగించింది.

తెల్లరేషన్‌కార్డుదారులు కోట్లు పెట్టి భూములు కొనడం తప్పేంటి? అని వాదిస్తున్న ఆంధ్రజ్యోతి.. అనర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులను తీసేవేయడం మాత్రం తప్పేనంటూ మరోపక్క కథనాలు రాస్తోంది. భారీగా భూములు, ఇళ్లలో సకల సౌకర్యాలు పెట్టుకున్న వారికి కూడా పింఛన్లు ఇవ్వాల్సిందేనని చెబుతోంది. ప్రజలను మాయ చేసేందుకు జిల్లా ఎడిషన్లలో శోకాలు వల్లిస్తోంది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని బాగా వంటబట్టించుకున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం.. ఎలా కావాలంటే అలా కథనాలు ప్రచురిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెల్లరేషన్‌కార్డు దారులను ముందుపెట్టి ప్రభుత్వ పెద్దలే భూ దందా చేసినట్లు సీఐడీ నిర్ధారించిన విషయం తెలిసిందే. ఏకంగా రూ. 220 కోట్లతో 761 ఎకరాలను 797 మంది తెల్లరేషన్‌కార్డు దారుల చేత కొనిపించారని తేల్చింది. దీనిపై ఈడీ కూడా విచారణ జరుపుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి