iDreamPost

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్.. ఇది చరిత్రలో మిగిలిపోవాలి అంతే..!

Gangs Of Godavari Movie Trailer Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్- కృష్ణ చైతన్య కాంబోలో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Gangs Of Godavari Movie Trailer Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్- కృష్ణ చైతన్య కాంబోలో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్.. ఇది చరిత్రలో మిగిలిపోవాలి అంతే..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంది. కానీ, ఈసారి మాత్రం వాయిదాలు లేవని హీరో కూడా బలంగానే చెప్పేశాడు. ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఫ్యాన్స్ ఈ మూవీ పెట్టుకున్న అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు అదిరిపోయే సినిమా ఇవ్వబోతున్నాడు అంటూ కామెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మే 31న థియేటర్లలో రచ్చ లేపేందుకు గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

డైరెక్టర్ కృష్ణ చైతన్య- విశ్వక్ సేన్ కాంబోలో వస్తున్న ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై గట్టిగానే అంచనాలు ఉన్నాయి. సాధారణంగా విశ్వక్ అంటేనే కాస్త మాస్ యాంగిల్ ఎక్కువగా కోరుకుంటారు. అలాంటిది విశ్వక్ సేన్ నుంచి ఈ రేంజ్ మాస్ మూవీ అనగానే ఫ్యాన్స్ అయితే ఆగలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అస్సలు ఆగలేము అంటున్నారు. సినిమాకి సంబంధించి ఈ ట్రైలర్ తో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. రత్న జీవితంలో ఎంతో కష్టపడి(క్రైములు చేసి) టైగర్ రత్న అనే ఒక పొలిటీషిన్ గా ఎదుగుతాడు.

ఆ ఊరిలో రత్నా చెప్పిందే జరుగుతుంది. ఓటర్లను తన దగ్గరున్న నోట్లతో కొనేస్తుంటాడు. ఎవరూ టైగర్ రత్నాకు ఎదురు చెప్పాలి అనుకోరు. చెప్పిన వాడు అలా మిగిలిపోడు. ఇలాంటి మొండోడు రాజకీయాల్లోకి వస్తే.. సాధారణంగానే మిగిలిన వాళ్లు తట్టుకోలేరు. అలాగే టైగర్ రత్నా అంటే పడని వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ పొలిటికల్ యాంగిల్, గోదావరిలో గ్యాంగ్స్ రచ్చ మాత్రమే కాకుండా.. ఈ మూవీలో మంచి సెంటిమెంట్ కూడా ఉంది. ముఖ్యంగా ఒక మంచి లవ్ స్టోరీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్ డేట్స్ అన్నీ ఒకెత్తు అయితే ఈ ట్రైలర్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంది.

ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ విశ్వరూపం అయితే కన్ఫామ్ గా కనిపిస్తోంది. అలాగే అంజలికి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పడింది. అంతేకాకుండా ఈ మూవీలో వైలెన్స్ మాత్రం అధిక మోతాదులోనే కనిపిస్తోంది. ఇంక డైలాగ్స్ గురించి ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ వస్తుంది. కాస్త వాడుక భాషలో గట్టిగానే డైలాగ్స్ ప్లాన్ చేశారు. ఒక యారగెంట్, యాటిట్యూడ్ ఉన్న యాంగ్రీ యంగ్ మ్యాన్ చేతికి పవర్ దక్కితే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని డైలాగ్స్ రూపంలో చూపించారు. విశ్వక్ సేన్ మూవీ కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి.. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి