వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ గర్జించిన రోజు అది. బౌలర్ అనేది చూడకుండా విచక్షణా రహితంగా బౌండరీలు, సిక్సులతో వీరూ అలరించిన ఆ ఇన్నింగ్స్‌కు 14 ఏళ్లు పూర్తయ్యాయి.
వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ గర్జించిన రోజు అది. బౌలర్ అనేది చూడకుండా విచక్షణా రహితంగా బౌండరీలు, సిక్సులతో వీరూ అలరించిన ఆ ఇన్నింగ్స్‌కు 14 ఏళ్లు పూర్తయ్యాయి.
సంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో అప్పటివరకు అంతా స్లోగానే బ్యాటింగ్ చేసేవారు. ఆ ప్లేయర్ల్, ఈ ప్లేయర్.. ఆ టీమ్, ఈ టీమ్ అనే తేడా లేదు. దాదాపుగా అందరూ ఒకే రకంగా ఆడేవారు. వికెట్లు కాపాడుకోవడం, చెత్త బాల్ వస్తే తప్ప షాట్లకు ఆడకపోవడం, క్రీజులో కుదురుకున్నాకే ఎక్కువ షాట్లు ఆడటం.. దాదాపుగా ఇదే ఫార్మాలాను అందరూ ఫాలో అయ్యేవారు. లోయరార్డర్లో వచ్చే బ్యాటర్స్ తప్పితే ఎవరూ హిట్టింగ్‌కు వెళ్లేవారు కాదు. అప్పటి పిచ్‌లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు బాగా సహకరించేవి. పేసర్లకు స్వింగ్, స్పిన్నర్లకు మంచి టర్న్ దొరికేది. అందుకే బ్యాటర్లు తమ జోన్లో పడితేనో లేదా చెత్త బాల్ వస్తేనే షాట్స్ ఆడేవారు. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ తీయడం.. గ్యాప్స్‌లోకి బంతిని పంపడంపై ఫోకస్ పెట్టేవారు.
2000వ దశకంలో టెస్ట్ క్రికెట్ ఆడిన తీరు గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అప్పట్లో లాంగ్ ఫార్మాట్లో కొందరు అటాకింగ్ గేమ్‌కు ప్రయత్నించినా రెగ్యులర్‌గా మాత్రం అదే రేంజ్లో ఆడలేకపోయారు. కానీ సరిగ్గా అదే టైమ్‌లో ఒక విధ్వంసకారుడు వచ్చాడు. అతడే టీమిండియా డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. అప్పటికే పదేళ్లకు పైగా జట్టులో ఆడుతున్న సెహ్వాగ్ క్రమంగా టెస్టుల్లో అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. బౌలింగ్ వేస్తోంది ప్రపంచ నంబర్ వన్ పేసరైనా, స్పిన్నరైనా అతడు పట్టించుకునేవాడు కాదు. పిచ్ ఎలా రియాక్ట్ అవుతోంది? దేనికి సహకరిస్తోంది? ఇంకా ఎంత స్కోరు కొట్టాలి? అనే లెక్కలేవీ వేసుకునేవాడు కాదు. క్రీజులోకి వచ్చాడా ఇక బాదుడు షురూ. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి పంపడమే అతడి పని.
టెస్టు క్రికెట్లో ఇప్పుడు బజ్‌బాల్ ఫార్ములా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ సెహ్వాగ్ 2009లోనే బజ్‌బాల్‌ను మించిన అటాకింగ్ గేమ్‌తో సత్తా చాటాడు. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ఒక టెస్టులో 253 బంతుల్లోనే 293 రన్స్ చేసి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్సులతో పాటు ఏకంగా 40 బౌండరీలు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 202 రన్స్ చేశాడు వీరూ. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరేంద్రుడి తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లకు 726 రన్స్ చేసింది.
ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 24 పరుగులతో గెలిచిన టీమిండియా.. మూడు మ్యాచుల ఆ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆ రోజు ఏ లంక బౌలర్‌నూ సెహ్వాగ్ వదల్లేదు. లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్‌ను కూడా కనికరించేదు వీరూ. ముత్తయ్య బౌలింగ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న భారత మాజీ ఓపెనర్ 84 రన్స్ చేశాడు. సెహ్వాగ్‌తో పాటు మరో ఓపెనర్ మురళీ విజయ్ (87), రాహుల్ ద్రవిడ్ (74), సచిన్ టెండూల్కర్ (53), వీవీఎస్ లక్ష్మణ్ (62) రన్స్ చేశారు. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని (100) పించ్ హిట్టింగ్తో భారత్ భారీ స్కోరు చేసింది. జహీర్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగడంతో లంకకు ఓటమి తప్పలేదు. సెహ్వాగ్ ఇన్నింగ్స్‌కు 14 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ అతడి బ్యాటింగ్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్నో మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ లంకపై ఆడిన ఈ నాక్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి. మరి.. సెహ్వాగ్ 293 ఇన్నింగ్స్ తలచుకుంటే మీకు ఏం అనిపిస్తుందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Team India: భారత్‌ను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలంటున్న మెకల్లమ్!
On this day, in 2009, Mr. Triple Ton @virendersehwag smashed his way to 293 against Sri Lanka in Mumbai 🙌🙌👏👏 #ThisDayThatYear
📽️Watch the full Video here📽️ https://t.co/fnnqPi9c0z pic.twitter.com/1qQFX5ACpG
— BCCI (@BCCI) December 4, 2019
On this day 14 years ago:
The ‘Sehwagball’ which destroyed Sri Lanka – 293 in just 254 balls, Sehwag missed out on his 3rd triple century in Tests. pic.twitter.com/XkB368BRUj
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2023