iDreamPost
android-app
ios-app

టీమిండియా హెడ్ కోచ్ గా ఆ దిగ్గజ ప్లేయరే కరెక్ట్.. కోహ్లీ చిన్ననాటి కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 29, 2024 | 9:01 AM Updated Updated May 29, 2024 | 9:01 AM

టీమిండియా హెడ్ కోచ్ గా ఆ భారత దిగ్గజమే సరైనోడ్ అంటూ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా హెడ్ కోచ్ గా ఆ భారత దిగ్గజమే సరైనోడ్ అంటూ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా హెడ్ కోచ్ గా ఆ దిగ్గజ ప్లేయరే కరెక్ట్.. కోహ్లీ చిన్ననాటి కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా హెడ్ కోచ్ ఎవరు? ప్రస్తుతం ఈ ప్రశ్న ప్రపంచ క్రికెట్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. కోచ్ పదవికి బీసీసీఐ విధించిన గడువు కూడా ముగిసింది. 3 వేల అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. అయితే అందులో సచిన్, మోదీ, అమిత్ షా పేర్లతో నకిలీ దరఖాస్తులు కూడా వచ్చాయి. కాగా.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి విదేశీ దిగ్గజాలు విముఖుత చూపిన నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్ కోచ్ గా గంభీర్ వద్దని, ఆ దిగ్గజ ప్లేయరే సరైనోడు అని తన అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఎవరెవరు అప్లై చేసుకున్నారు? ఎవరి దరఖాస్తులు చెల్లుబాటు అయ్యాయి? ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? అన్నది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు బీసీసీఐ. దీంతో టీమిండియా కోచ్ గా ఎవరొస్తారు అన్నది ఇంకా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి. కానీ భారత కోచ్ గా టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని సరైనోడు అని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ..”టీమిండియా కోచ్ గా ఎవరొచ్చినా పర్వాలేదు. కానీ టీమిండియా నుంచే రావాలి. ఒకవేళ ఐపీఎల్ కు ధోని వీడ్కోలు పలికితే.. హెడ్ కోచ్ అతడి ఎంపిక సరైంది. భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించడమే కాకుండా.. అతడికి డ్రెస్సింగ్ రూమ్ లో గౌరవం ఎక్కువ కూడా ఉంటుంది. పైగా టీ20 ఫార్మాట్స్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన అనుభవం అతడి సొంతం. ధోని టీమిండియాలోకి వచ్చేనాటికే.. సెహ్వాగ్, సచిన్, హర్భజన్, గంభీర్, కుంబ్లే లాంటి స్టార్లు ఉన్నారు. అయినప్పటికీ.. ఎలాంటి వివాదాలు లేకుండా జట్టును అద్భుతంగా నడిపించాడు. ఇలాంటి వాడే హెడ్ కోచ్ గా సరైనోడు” అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ చిన్ననాటి కోచ్.

కాగా.. బీసీసీఐ మాత్రం స్టీఫెన్ ఫ్లెమింగ్ ను హెడ్ కోచ్ గా ఉండేందుకు ఒప్పించాలని ధోనిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫ్లెమింగ్ మాత్రం కోచ్ గా ఉండటానికి ఒకే చెప్పలేదు. ఈ కీవీస్ దిగ్గజంతో పాటుగా రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ లతో పాటుగా మరికొందరు వీదేశీ దిగ్గజాలు టీమిండియా హెడ్ కోచ్ పదవి స్వీకరించడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో భారత కోచ్ గా ఎవరొస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి రాజ్ కుమార్ శర్మ అన్నట్లుగా కోచ్ గా ధోని వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.