iDreamPost

టాలీవుడ్‌లో Jr.NTR నాకు మంచి ఫ్రెండ్! అతనిలో ఆ విషయం చాలా ఇష్టం: కోహ్లి

Virat, NTR: విరాట్ కోహ్లి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు రెండు వేరు వేరు రంగాల్లో సూపర్ స్టారు. ఒకరు క్రీడా రంగంలో అయితే మరోకరు సినీ రంగంలో స్టార్లుగా కొనసాగుతున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ క్లోహి..తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు

Virat, NTR: విరాట్ కోహ్లి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు రెండు వేరు వేరు రంగాల్లో సూపర్ స్టారు. ఒకరు క్రీడా రంగంలో అయితే మరోకరు సినీ రంగంలో స్టార్లుగా కొనసాగుతున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ క్లోహి..తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు

టాలీవుడ్‌లో Jr.NTR నాకు  మంచి  ఫ్రెండ్! అతనిలో ఆ విషయం చాలా ఇష్టం: కోహ్లి

టాలీవుడ్ టాప్ హీరోల్లో యంగ్ టైగర్, నేషనల్ స్టార్ నందమూరి తారక రామరావు ఒకరు. తన నటనా ప్రతిభతో ఎందరో అభిమానులను సొంతం చేసున్నారు.  తారక్ ప్రతిభ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. దేశ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలువురు సెలబ్రిటీలు సైతం తారక్ కి అభిమానులుగా ఉన్నారు. ఎన్టీఆర్ టాలెంట్ కి స్టార్ క్రికెటర్స్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ క్లోహి..తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి.. ఆ పూర్తి విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

విరాట్ కోహ్లి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు రెండు వేరు వేరు రంగాల్లో సూపర్ స్టారు. ఒకరు క్రీడా రంగంలో అయితే మరోకరు సినీ రంగంలో స్టార్లుగా కొనసాగుతున్నారు. ఇక వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి వారిద్దరు కూడా చాలా క్లోజ్ ప్రెండ్స్ అంట. విన్నాడానికి ఆశ్చర్యమైన.. ఆ విషయాన్ని విరాటే స్వయంగా చెప్పాడు. జూనియర్ ఎన్టీర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో తారక్ తనకు మంచి స్నేహితుడంటూ కోహ్లి వ్యాఖ్యలు చేశాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు హీరోల్లో తారక్ తనకు మంచి స్నేహితుడని, నటుడిగానూ ఆయనను ఎంతో అభిమానిస్తానని కోహ్లీ తెలిపాడు. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ తో కలిసి ఒక యాడ్ లో యాక్ట్ చేశానని, ఆ సమయంలో తారక్ వ్యక్తిత్వాన్ని చూసి ఫిదా అయ్యాని కోహ్లి తెలిపాడు. తారక్ ఆప్యాయంగా మాట్లాడే తీరు తనకు నచ్చుతుందని, ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ యాక్టింగ్ అద్భుతమని, చెప్పడానికి మాటలు సరిపోవని తెలిపాడు ఇక ఆ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్పులేస్తూ తాను, అనుష్క రీల్స్ కూడా చేశామని విరాట్ చెప్పుకొచ్చాడు.

గతేడాది తాము ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ వచ్చిందని తెలిసి ఎంతో సంబరపడిపోయనని, ప్రత్యేక సందర్భాల్లో తారక్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతానని క్లోహి చెప్పుకొచ్చాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ.. స్వయంగా ఎన్టీఆర్ తనకు స్నేహితుడని అని, అతని యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ గురించి విరాట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. తారక్ పై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి