iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 01, 2024 | 8:59 AM Updated Updated Mar 01, 2024 | 10:05 PM

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా డొమెస్టిక్ క్రికెట్ బరిలోకి దిగాలని, వారు ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించాడు టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా డొమెస్టిక్ క్రికెట్ బరిలోకి దిగాలని, వారు ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించాడు టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్.

రోహిత్, కోహ్లీ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేయడంతో.. టీమిండియాలో పెద్ద దూమారమే చెలరేగిందని చెప్పాలి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంతో.. వారిపై కొరడా ఝుళిపించింది బీసీసీఐ. అయితే ఈ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా డొమెస్టిక్ క్రికెట్ బరిలోకి దిగాలని, వారు ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అవకాశం ఉన్నాగానీ వారు రంజీల్లో బరిలోకి దిగకపోవడంతో.. మేనేజ్ మెంట్ వారిపై కొరడా ఝుళిపించింది. ఇక ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ లో 11 మంది కొత్త యంగ్ ప్లేయర్లకు చోటు లభించగా.. సీనియర్ ప్లేయర్లకు షాకిచ్చింది బీసీసీఐ. శిఖర్ దావన్, పుజారా, రహానే, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మకు కాంట్రాక్ట్ లో చోటు లభించలేదు. ప్రస్తుతం ఈ విషయం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే ఇష్యూపై కాస్త ఘాటుగానే స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని, వారు ఎందుకు ఆడటంలేదని బీసీసీఐని ప్రశ్నించాడు.

“ప్రతి ఒక్క భారత క్రికెటర్ రంజీ క్రికెట్ ఆడాల్సిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాలి. వారిని ఎందుకు అలా ఆడించడం లేదు. ఇషాన్, శ్రేయస్ పైనే కొరడా ఝుళిపించడం తప్పు. రూల్స్ అతిక్రమిస్తే.. ఎవరిమీదైనా ఇలాంటి చర్యలే తీసుకోవాలి. ప్రస్తుతం యువ ప్లేయర్లు అంతా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ పైనే దృష్టిపెడుతున్నారు. కానీ ఒక ప్లేయర్ గా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని డొమెస్టిక్ క్రికెట్ అందిస్తుంది. కోహ్లీ, రోహిత్ లు కూడా రంజీల్లో ఆడేలా చూడాలి” అంటూ చెప్పుకొచ్చాడు ఈ టీమిండియా మాజీ ప్లేయర్.

సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, మెుహిందర్ అమర్ నాథ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు దేశవాళీ మ్యాచ్ లు ఆడేవారని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ లు లేనప్పుడు కౌంటీల్లోకి దిగుతారని కీర్తి ఆజాద్ పేర్కొన్నాడు. అలాంటి భారత క్రికెటర్లకు ఏమైందని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇది రానురాను భారత క్రికెట్ కు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరి రోహిత్, విరాట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న ఈ భారత మాజీ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆ విషయంపై తొలిసారి స్పందించిన హార్దిక్.. నాకేం బాధలేదంటూ..!