iDreamPost

ఆ విషయంపై తొలిసారి స్పందించిన హార్దిక్.. నాకేం బాధలేదంటూ..!

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ విషయంలో నాకెలాంటి బాధలేదని చెప్పుకొచ్చాడు పాండ్యా.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ విషయంలో నాకెలాంటి బాధలేదని చెప్పుకొచ్చాడు పాండ్యా.

ఆ విషయంపై తొలిసారి స్పందించిన హార్దిక్.. నాకేం బాధలేదంటూ..!

హార్దిక్ పాండ్యా.. గత కొంతకాలంగా టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన పేరు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తప్పించి.. ఆ పగ్గాలను పాండ్యాకు అప్పగించడం. మరోటి డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా.. ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొనడం. ఐపీఎల్ ప్రాక్టీస్ లో పాల్గొనడంతో.. బీసీసీఐ సీరియస్ అయ్యింది. దీంతో డీవై పాటిల్ టీ20 కప్ 2024లో రిలయన్స్ 1 టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కానీ ఒకే మ్యాచ్ ఆడి.. తర్వాత మ్యాచ్ లో కనిపించలేదు పాండ్యా. కాగా.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాండ్యా ఆ విషయంలో నాకేం బాధలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ 2023లో గాయపడటంతో.. టీమిండియాకు గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటూ వస్తున్నాడు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. డీవై పాటిల్ టీ20 కప్ లోకి రి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 22 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే నెక్ట్స్ మ్యాచ్ కే కనపడకుండా పోయాడు పాండ్యా. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేశాడు.

“చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మీరు ఎక్కువగా బయటకనిపించరు ఎందుకు? అని. నా గురించి ఫ్యాన్స్ కు తెలియని నిజం ఏంటంటే? నాకు బయట తిరగడం ఎక్కువగా ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తా. గత 3-4 ఏళ్లలో నేను బయటకి వెళ్లిన సందర్బాలు చాలా తక్కువ. ఇటీవల 50 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంట్లోనే జిమ్, థియేటర్ తో పాటుగా నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. మీడియాతో కూడా ఎక్కువగా మాట్లాడను. ఇలా ఇంట్లోనే ఉండటం నాకేం బాధగా అనిపించడం లేదు” అంటూ తన వ్యక్తిగత విశేషాలను పంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో ‘ఏ’ గ్రేడ్ లో తన ప్లేస్ ను నిలుపుకున్నాడు.

ఇదికూడా చదవండి: 13 మంది స్టార్ క్రికెటర్లకు అస్వస్థత! ఒకరికి సీరియస్.. అసలేం జరిగిందంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి