iDreamPost

IPLపై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ.. ఏమన్నాడంటే?

IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ ఐపీఎల్ టోర్నీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఐపీఎల్ గురించి కోహ్లీ ఏమన్నాడంటే?

IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ ఐపీఎల్ టోర్నీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఐపీఎల్ గురించి కోహ్లీ ఏమన్నాడంటే?

IPLపై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ.. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2024.. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే ఈ జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ స్టార్ట్ అవ్వబోతోంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అతడు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ కోహ్లీ ఏమన్నాడంటే?

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కలలు కంటాడు. డబ్బుకు డబ్బుతో పాటుగా పేరు కూడా వస్తుండటంతో.. ఈ లీగ్ కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ మెగాటోర్నీలో పాల్గొనాలని చాలా మంది క్రికెటర్లు ఆశపడుతూ ఉంటారు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. 17వ ఎడిషన్ కోసం ఇప్పటికే యాజమాన్యాలు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలోపడ్డాయి. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

“వరల్డ్ వైడ్ గా చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ ను ఇష్టపడటానికి కారణం ఒకటుంది. ఇక్కడ ఆటగాళ్లు దేశాలకు అతీతంగా సోదర భావంతో మెలుగుతారు. నేషనల్ టీమ్ కు ఆడుతున్నప్పుడు.. ప్రత్యర్థి టీమ్ లో మనకెంతో కాలంగా తెలిసిన ప్లేయర్లు, ఇక్కడ మనతో ఆడుతుంటే.. ఆ సంతోషమే వేరు. అందుకే ప్లేయర్లు ఈ లీగ్ లో ఆడటానికి చాలా ఇష్టపడతారు. ప్లేయర్లే కాదు.. అభిమానులు సైతం పంచే ప్రేమ వెలకట్టలేనిది. ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడేటప్పుడు శత్రువులుగా మారిన వారు.. ఈ టోర్నీలో ఫ్రెండ్స్ గా మారిపోతూ ఉంటారు” అంటూ చెప్పుకొచ్చాడు విరాట్.

ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్న కోహ్లీ.. ఐపీఎల్ 2024 సీజన్ కు అందుబాటులోకి వస్తాడా? రాడా? అన్న అనుమానలు తలెత్తాయి. కొడుకు పుట్టడంతో.. ఈ గ్యాప్ తీసుకున్నట్లు వెల్లడించాడు కోహ్లీ. తాజాగా ఐపీఎల్ పై ఆసక్తికర కామెంట్స్ చేయడంతో.. విరాట్ ఐపీఎల్ కు సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. మరి గత 16 సీజన్లుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ టైటిల్ ను ఈసారైనా ఆర్సీబీ ముద్దాడుతుందో? లేదో? చూడాలి.

ఇదికూడా చదవండి: ఇంగ్లండ్‌పై గెలుపు.. రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన రోహిత్‌ శర్మ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి