iDreamPost

ఇంగ్లండ్‌పై గెలుపు.. రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన రోహిత్‌ శర్మ!

  • Published Mar 09, 2024 | 3:56 PMUpdated Mar 09, 2024 | 3:56 PM

Rohit Sharma, Retirement: ఇం‍గ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఫుల్‌ ఖుషీలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్‌ అయ్యే విషయం చెప్పాడు రోహిత్‌ శర్మ. తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకోవాలని అనుకుంటున్నానో వెల్లడించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Retirement: ఇం‍గ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఫుల్‌ ఖుషీలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్‌ అయ్యే విషయం చెప్పాడు రోహిత్‌ శర్మ. తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకోవాలని అనుకుంటున్నానో వెల్లడించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 09, 2024 | 3:56 PMUpdated Mar 09, 2024 | 3:56 PM
ఇంగ్లండ్‌పై గెలుపు.. రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన రోహిత్‌ శర్మ!

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టులు సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. తొలి మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో గెలిచిన తొలి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేశాడు. ఇంత సంతోషకరమైన సమయంలో రోహిత్‌ శర్మ తన రిటైర్మెంట్‌ గురించి సంచలన ప్రకటన చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి తర్వాత రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తాను ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానో రోహిత్ శర్మ బయటపెట్టేశాడు. ఎప్పుడైతే.. తాను సరిగ్గా ఆడటం లేదని తనకు అర్థమైవుతుందో.. అప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని, గత కొన్నేళ్లుగా తాను అద్బుతంగా ఆడుతున్నట్లు రోహిత్‌ శర్మ ప్రకటించాడు.

రోహిత్‌ చేసిన ఈ ప్రకటనతో ఇప్పట్లో రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం లేదనే విషయం మాత్రం స్పష్టమైంది. ఈ సిరీస్‌ తర్వాత ఐపీఎల్‌ ఆడనున్న రోహిత్‌ శర్మ.. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ 2024లో టీమిండియాను లీడ్‌ చేయనున్నాడు. తన కెప్టెన్సీలో వరల్డ్‌ కప్‌ నెగ్గాలనే డ్రీమ్‌ పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో చాలా దగ్గరకు వెళ్లి ఫైనల్లో కప్పును చేజార్చుకున్నాడు. కానీ, రోహిత్‌ మరో ఏడాదిలోపే ఇంకో కప్పు గెలిచే అవకాశం వచ్చింది. అదే టీ20 వరల్డ్‌ కప్‌. కానీ, రోహిత్‌ శర్మకు వన్డే వరల్డ్‌ కప్‌పైనే ఎక్కువ గురి ఉంది. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గడం కూడా చిన్న విషయం ఏం కాదు. అందుకే.. భారత్‌కు రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించాలని రోహిత్‌ శర్మ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. దాని కోసమే టీమ్‌ను రెడీ కూడా చేస్తున్నాడు.

ఇక ఈ సిరీస్‌ విషయానికి వస్తే.. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా వేగంగా పుంజుకుని.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ విజయంతో వెనుదిరి చూసుకోలేదు. వరుసగా నాలుగు టెస్టులు నెగ్గి.. 4-1తో సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. విరాట్‌ కోహ్లీ, షమీ లేకపోయినా, కేఎల్‌ రాహుల్‌ నాలుగు టెస్టులు దూరమైనా, జడేజా, బుమ్రా ఒక్కో మ్యాచ్‌ ఆడకపోయినా.. పూర్తిగా యువ జట్టును అద్భుతంగా నడిపించాడు. బ్యాటర్‌గా ఆరంభం మ్యాచ్‌ల్లో విఫలమైనా.. తర్వాత ఫామ్‌ అందుకున్నాడు. రెండు సెంచరీలు కూడా చేశాడు. ప్రస్తుతం ఇంత సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ మరి కొంత కాలం టీమిండియాకు ఆడి గొప్ప గొప్ప విజయాలు అందించాలని ఫ్యాన్స్‌ కూడా ఆశిస్తున్నారు. మరి ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో నిర్ణయించుకున్న రోహిత్‌ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి