iDreamPost

మంచి పని చేసిన CSK మేనేజ్‌మెంట్‌! హ్యాట్సాఫ్‌ అంటున్న ఫ్యాన్స్‌

  • Published May 07, 2024 | 11:13 AMUpdated May 07, 2024 | 11:13 AM

CSK, Metal Vessel, Chennai: ఐపీఎల్‌లో అదరగొడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి మంచి పనితో అందరి మన్ననలు పొందింది. మరి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

CSK, Metal Vessel, Chennai: ఐపీఎల్‌లో అదరగొడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి మంచి పనితో అందరి మన్ననలు పొందింది. మరి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 07, 2024 | 11:13 AMUpdated May 07, 2024 | 11:13 AM
మంచి పని చేసిన CSK మేనేజ్‌మెంట్‌! హ్యాట్సాఫ్‌ అంటున్న ఫ్యాన్స్‌

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దేశంలో ఎక్కడ మ్యాచ్‌ జరిగినా.. సీఎస్‌కేకు సపోర్ట్‌ ఉంటుంది. లక్నోలో జరిగిన మ్యాచ్‌లో సొంత టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ను మించి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అభిమానుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది. అది సీఎస్‌కే రేంజ్‌. అయితే.. ఆ క్రేజ్‌కు ప్రధాన కారణం ధోని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనితో పాటు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ చేసే కొన్ని మంచి పనులు కూడా ఆ జట్టుకు అంత భారీ రేంజ్‌లో అభిమానం, మద్దతు లభించేందుకు కారణం అవుతుంది. తాజాగా మరోసారి సీఎస్‌కే ఒక గొప్ప ఇన్సియేట్‌ తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కార్పొరేట్‌ కల్చర్‌లో సోషల్‌ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా సమాజ హితం కోసం కొన్ని మంచి పనులు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా అలాంటి ఓ మంచి పనినే చేసింది. ప్లాస్టింగ్‌ వాడకాన్ని తగ్గించేందుకు చెన్నైలోని 8 వేల మంది బస్‌ కండెక్టర్లకు మెటల్‌తో చేసిన విజిల్‌ను ఇచ్చింది. సాధారణంగా బస్‌ను ఆపేందుకు, వెళ్లమని డ్రైవర్‌కు అర్థమయ్యేలా చెప్పేందుకు బస్‌ కండెక్టర్లు విజిల్‌ ఊది చెబుతుంటారు. అయితే.. ఈ విజిల్స్‌ను ప్లాస్టిక్‌తో తయారు చేస్తుండటంతో ప్లాస్టిక్‌ వాడకం పెరిగింది.

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడానికి సీఎస్‌కే ఈ మెటల్‌ విజిల్స్‌ను అందించారు. అలాగే సీఎస్‌కే ట్యాగ్‌ లైన్‌ కూడా విజిల్‌ పోడుకి కూడా పబ్లిసిటీ చేసినట్లు అవుతుంది. అయితే.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్‌ అభిమానులతో పాటు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ను అభినందిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో చెన్నై మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. మరి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ 8 వేల మెటల్‌ విజిల్స్‌ పంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి