iDreamPost
android-app
ios-app

ఒక్క ఇన్‌స్టా పోస్టుకు రూ.11 కోట్లకు పైనే..! భారీ ట్విస్ట్‌ ఇచ్చిన కోహ్లీ

  • Published Aug 12, 2023 | 11:22 AM Updated Updated Aug 12, 2023 | 11:22 AM
  • Published Aug 12, 2023 | 11:22 AMUpdated Aug 12, 2023 | 11:22 AM
ఒక్క ఇన్‌స్టా పోస్టుకు రూ.11 కోట్లకు పైనే..! భారీ ట్విస్ట్‌ ఇచ్చిన కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌, ఛేజ్‌ మాస్టర్‌.. వీటన్నంటికీ మించి ది కింగ్‌ కోహ్లీ. అతని రేంజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో నంబర్‌ వన్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ. క్రికెట్‌ అభిమానులకు అతనో డ్రగ్‌. ఇండియాలో అత్యధిక సోషల్‌ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తి కోహ్లీనే. ఇదొక్కటి చాలు కోహ్లీకి ఉన్న క్రేజ్‌ ఏంటో చెప్పడానికి. అయితే.. సెలబ్రేటిలు వాళ్లకున్న క్రేజ్‌ను కూడా క్యాష్‌ చేసుకునే అవకాశం ఉంది. అది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ఎక్కువ. చాలా మంది సెలబ్రెటీలు తమ ఇన్‌స్టా అకౌంట్‌లో పెయిడ్‌ ప్రమోషన్స్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. బ్రాండ్‌లకు ప్రచారం కల్పించడం ద్వారా వారికి డబ్బు వస్తుంది. కోహ్లీ సైతం ఇన్‌స్టాలో పలు బ్రాండ్‌కు ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతుంటాడు.

అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంత భారీ ఫాలోయింగ్‌ ఉండటం, కోహ్లీ ఇంటర్నేషన్‌ సెలబ్రెటీ కావడంతో అతనికి భారీ మొత్తంలోనే డబ్బు అందుతుంది. కానీ, అది ఎంతో చాలా మందికి తెలియదు. కానీ.. గత రెండు రోజులుగా కోహ్లీకి ఒక్క పోస్టుకు దాదాపు రూ.12 కోట్లు సంపాదిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఒక్క పోస్టు చేస్తే అన్ని కోట్లు వస్తాయా అని చాలా మంది నోరెళ్లబెట్టారు. ఇది రెండో రోజులుగా సెన్సెన్‌గా మారడంతో దీనిపై కోహ్లీ స్పందించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ సంపాదనపై వస్తున్న వార్తలు నిజం కాదంటూ బాంబు పేల్చాడు. తనకు అంత మొత్తంలో సోషల్‌ మీడియాలో సంపాదలేదంటూ స్పష్టతనిచ్చాడు. ‘జీవితంలో నేను అందుకున్న ప్రతిదానికీ నేను కృతజ్ఞత చూపిస్తూ రుణపడి ఉన్నాను. నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం చేస్తున్న వార్తలు నిజం కాదు’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో కోహ్లీకి ఒక్క ఇన్‌స్టా పోస్టుకు రూ.12 కోట్లు రావడం అబద్ధమనే విషయం స్పష్టమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెంచరీతో దుమ్మరేపిన పుజారా! మ్యాచ్‌ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు