iDreamPost
android-app
ios-app

సెంచరీతో దుమ్మరేపిన పుజారా! మ్యాచ్‌ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు

  • Published Aug 12, 2023 | 10:36 AM Updated Updated Aug 12, 2023 | 10:36 AM
  • Published Aug 12, 2023 | 10:36 AMUpdated Aug 12, 2023 | 10:36 AM
సెంచరీతో దుమ్మరేపిన పుజారా! మ్యాచ్‌ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం అతను టీమిండియాలో లేడు కదా.. సెంచరీ ఎక్కడ చేశాడని అనుకుంటున్నారా? ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు పుజారా. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు కోసం పుజారాను ఎంపిక చేయలేదు. దీంతో మళ్లీ టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు పుజారా కౌంటీలను వేదికగా ఎంచుకున్నాడు. గతంలోనూ ఓ సారి టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన సమయంలో ఇంగ్లండ్‌ కౌంటీల్లో అదరగొట్టిన టీమిండియాలోకి పునారగమనం చేసిన పుజారా.. మళ్లీ అదే దారి పట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో ససెక్స్‌ జట్టు తరపున ఆడుతున్న పుజారా.. శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.

319 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్‌ టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. 113 బంతుల్లో 11 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన పుజారా.. ససెక్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ టోర్నీలో పుజారాకు ఇదో రెండు సెంచరీ కావడం విశేషం. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన పుజారా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎక్కడాడిన వంద శాతం ఎఫర్ట్‌ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. టీమిండియా మరో మూడు నెలల పాలు టెస్టులు ఆడే అవకాశం లేదు. మళ్లీ డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ ఉంది. అప్పటి వరకు తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే’ అని పుజారా పేర్కొన్నాడు.

అయితే.. టీమిండియాలో యువ క్రికెటర్ల హవా పెరిగిపోవడంతో పుజారా, రహానే లాంటి సీనియర్‌లకు కాలం చెల్లిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా వాళ్లు కూడా పెద్దగా రాణించడం లేదు. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో పుజారాపై సెలెక్టర్లు వేటు వేశారు. వెస్టిండీస్‌ టూర్‌కు ఎంపిక చేయలేదు. అయినా కూడా టీమిండియా 1-0తో విండీస్‌పై సిరీస్‌ నెగ్గింది. దీంతో పుజారా లేకపోయినా టీమ్‌లో పెద్దగా ప్రభావం పడదనే అభిప్రాయం వచ్చింది. కానీ, పుజారా మాత్రం కౌంటీల్లో అదురగొడుతూ.. మళ్లీ టీమ్‌లోకి రావడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని టీమిండియా సెలెక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు. మరి పుజారా తిరిగి టీమిండియాలోకి వస్తాడా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని అంటే పడిచచ్చే రాష్ట్రం! అక్కడే ఘోర అవమానం

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş