Nidhan
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడేమీ దేవుడు కాదన్నాడు. ఇంకా ఏమేం అన్నాడంటే..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడేమీ దేవుడు కాదన్నాడు. ఇంకా ఏమేం అన్నాడంటే..
Nidhan
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్బ్ టచ్‌లో కనిపిస్తున్నాడు. కొడుకు పుట్టడంతో ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న కింగ్.. మళ్లీ ఐపీఎల్-2024తో కాంపిటీటివ్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌లో అతడి బ్యాట్ ఓ రేంజ్లో గర్జిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కు మరింత పదునెక్కి పరుగుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచుల్లో 147 స్ట్రయిక్ రేట్‌తో 500 పరుగులు చేశాడు విరాట్. 4 హాఫ్ సెంచరీలు బాదిన కింగ్.. ఓ సెంచరీ కూడా కొట్టాడు. దీన్ని బట్టే అతడి ఫామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ గెలుపోటములతో సంబంధం లేకుండా కోహ్లీ బ్యాటింగ్‌ను చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. అయితే ఇంత బాగా ఆడుతున్నా అతడిపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు.
ఈ ఐపీఎల్లో కోహ్లీ యావరేజ్ 71గా ఉంది. సగటు విషయంలో అతడ్ని వంక పెట్టడానికి లేదు. కానీ స్ట్రయిక్ రేటే ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్‌గా వస్తున్న విరాట్ ఆఖరి వరకు క్రీజులో ఉంటున్నా, భారీ స్కోర్ చేస్తున్నా, స్ట్రయిక్ రేట్‌ను మాత్రం మెరుగుపర్చుకోవడం లేదు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ స్లో అయిపోతున్నాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. చాలా నెమ్మదిగా ఆడుతున్నాడని, ఇలా ఆడితే టీ20 వరల్డ్ కప్‌లో కష్టమేనని, స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ ఏమీ దేవుడు కాదని.. అతడూ మనలాగే సామాన్య మానవుడేనని అన్నాడు. కింగ్‌కు అతడు సపోర్ట్‌గా నిలిచాడు.
‘విరాట్ కోహ్లీని చాలా మంది ప్రేక్షకులు దేవుడిలా కొలుస్తారు. కింగ్ ప్రతిదీ చేయగలడని, అతడికి సాధ్యం కానిది ఏదీ లేదని, ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయడం అతడి వల్ల అవుతుందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే కోహ్లీ కూడా మనలాగే ఓ మామూలు మనిషి. కానీ అతడో అసాధారణ బ్యాట్స్‌మన్. అతడి బ్యాట్ నుంచి 80 సెంచరీలు వచ్చాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతడి మాదిరిగా పరుగులు చేయడం ఎవరి వల్లా కాదు. స్పిన్నర్లను అతడు బాదినట్లుగా రన్ ఛేజ్ టైమ్‌లో ఎవరైనా ఆడగలరా? కాబట్టి అతడి విషయంలో అంత కఠినంగా వ్యవహరించడం సరికాదు’ అని సిద్ధు స్పష్టం చేశాడు. ఇక, నిన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విరాట్ 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో పేసర్ల బౌలింగ్‌లో 10 బంతుల్లో 9 పరుగులు చేసిన కోహ్లీ.. స్పిన్‌లో 34 బంతుల్లో 61 రన్స్ చేశాడు.
Navjot Singh Sidhu said – “People think Virat Kohli is a God and he does everything and does everything right. Virat Kohli is a human. The man has 80 Hundreds and the way he batted against spinners, who will do this in run chase?, so don’t be so critical just his presence”. pic.twitter.com/vXUMSQapcJ
— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024