iDreamPost
android-app
ios-app

Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కింగ్ విరాట్ కోహ్లీ!

  • Author Soma Sekhar Updated - 11:37 AM, Wed - 13 December 23

రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ.. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. తాజాగా మరో మైలురాయిని తన ఖతాలో వేసుకున్నాడు.

రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ.. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. తాజాగా మరో మైలురాయిని తన ఖతాలో వేసుకున్నాడు.

  • Author Soma Sekhar Updated - 11:37 AM, Wed - 13 December 23
Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కింగ్ విరాట్ కోహ్లీ!

విరాట్ కోహ్లీ.. అభిమానులు ముద్దుగా రికార్డుల రారాజు, రన్ మెషిన్, టీమిండియా సూపర్ స్టార్ అంటూ పిలుచుకుంటారు. తనదైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్న మకుటం లేని మహారాజు కింగ్ కోహ్లీ. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఈ స్టార్ బ్యాటర్. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ.. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తాజాగా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. నెట్ ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ 25 ఏళ్ల చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్ విరాట్ కోహ్లీ.

విరాట్ కోహ్లీ.. ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు. ఆధునిక క్రికెట్ ను తన బ్యాట్ తో మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. ఇప్పటికే ఎన్నో తిరుగులేని రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ పరుగుల రారాజు.. తాజాగా మరో మైల్ స్టోన్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చింజిన్ అయిన గూగుల్ తాజాగా తన 25 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. అందులో గడిచిన 25 ఏళ్లుగా అత్యధిక మంది వెతికిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నాగానీ.. వారందరిని దాటుకుని ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఈ విషయం తెలిసిన కోహ్లీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. గూగుల్ లో ఈ 25 సంవత్సరాల్లో ఎక్కువ సార్లు వెతికిన అథ్లెట్ గా పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియన్ రొనాల్డో నిలిచాడు. అదే విధంగా అత్యధికంగా వెతికిన ఆటగా ఫుట్ బాల్ నిలిచింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కూడా విరాట్ తన హవా కొనసాగిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీకి 265 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా.. మరికొన్ని రోజుల్లో సౌతాఫ్రికా గడ్డపై జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు కోహ్లీ. ఈ సిరీస్ లో అతడు కీలకమని ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాలు చెప్పిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్.. ఈ అరుదైన ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.