SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీతో అరుదైన ఘనత సాధించిన కోహ్లీ.. అదే క్రమంలో మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు.. ఏకంగా క్రికెట్ దేవుడు నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు. వంద సెంచరీలతో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న సచిన్ టెండ్కూలర్ నెలకొల్పిన రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం..
వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియా రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది 76వ సెంచరీ. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలతో కోహ్లీ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాడు. అయితే.. సచిన్ 500వ మ్యాచ్ తర్వాత 75 సెంచరీలు పూర్తి చేస్తే.. కోహ్లీ ఆ రికార్డును బద్దులకొట్టాడు. 500వ మ్యాచ్‌లో కోహ్లీ 76 సెంచరీలు పూర్తి చేసుకోవడంతో సచిన్ రికార్డ్ బ్రేక్ అయింది. కాగా, టెస్టుల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ. ఇందులో విశేషం ఏంటంటే.. సచిన్ కూడా తన 29వ టెస్ట్ సెంచరీని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే చేశాడు. ఇప్పుడు కోహ్లీ సైతం ఇక్కడే తన 29వ టెస్ట్ సెంచరీ సాధించి, గురువు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చకున్నాడు.
ఈ రికార్డుతో సచిన్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేసేందుకు మరో అడుగు ముందుకు వేశాడు. మరో 24 సెంచరీలు చేస్తే.. కోహ్లీ సచిన్ వంద సెంచరీల రికార్డును సమం చేస్తాడు. అయితే అది అంత సులువైన విషయం కాదు. కోహ్లీ మరో 24 సెంచరీలు పూర్తి చేసేవరకు కెరీర్ కొనసాగిస్తాడో లేదో చూడాలి. అయితే.. కోహ్లీ 76వ సెంచరీ పూర్తి చేసుకోవడంపై సచిన్ సైతం స్పందిస్తూ.. కోహ్లీని అభినందించారు. ‘మరో రోజు.. మరో సెంచరీ.. వెల్ ప్లేయడ్ కోహ్లీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. మరి కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most centuries on 500th match:
Virat Kohli – 76*
Sachin Tendulkar -75 pic.twitter.com/ovHtNTgYF5
— Johns. (@CricCrazyJohns) July 21, 2023
ఇదీ చదవండి: సెంచరీ తర్వాత సిల్లీగా ఔటైన కోహ్లీ! పేలుతున్న మీమ్స్