Nidhan
విరాట్ కోహ్లీ అంటే తమకు దడ అని అంటున్నాడో పాక్ లెజెండ్. అతడు తమ టీమ్ బెండు తీసిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని చెప్పాడు.
విరాట్ కోహ్లీ అంటే తమకు దడ అని అంటున్నాడో పాక్ లెజెండ్. అతడు తమ టీమ్ బెండు తీసిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని చెప్పాడు.
Nidhan
విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెబితే చాలు ఎంతటి బౌలర్‌కైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వరల్డ్ టాప్ బౌలర్స్‌ను పోయించిన బ్యాటర్ అతడు. టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు.. ముందు కోహ్లీని ఎలా ఆపాలనే అన్ని జట్లు ఆలోచిస్తుంటాయి. కింగ్ ఉన్నంత సేపు ప్రత్యర్థి జట్టుకు ఊపిరి ఆడదు. అతడ్ని ఔట్ చేస్తే గానీ మ్యాచ్‌పై పట్టు దక్కదని తెలుసు. అందుకే వ్యూహాలన్నీ కోహ్లీ చుట్టూనే అల్లుకుంటారు. అయితే వీటన్నింటినీ ఛేదించి బయటపడటం టీమిండియా స్టార్ అలవాటు చేసుకున్నాడు. అన్ని టీమ్స్‌ను గడగడలాడిస్తూ దూసుకెళ్తున్నాడు. సాధారణ సిరీస్‌ల్లోనే గాక వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నీల్లోనూ ఎలా ఆడాలనే కిటుకు అతడికి బాగా తెలుసు. ఇదే విషయాన్ని ఓ పాకిస్థాన్ లెజెండ్ చెబుతున్నాడు.
కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని.. అతడితో పెట్టుకోవాలంటేనే తమ జట్టు భయపడుతుందని పాకిస్థాన్ దిగ్గజం మిస్బావుల్ హక్ అన్నాడు. విరాట్ అంటే తమకు దడ అని.. బిగ్ మ్యాచెస్‌లో పలుమార్లు అతడు తమ టీమ్ బెండు తీశాడని మిస్బా గుర్తుచేసుకున్నాడు. ‘కోహ్లీ టాప్ క్లాస్ బ్యాటర్. పాకిస్థాన్ మీద మానసికంగా అతడిదే పైచేయి. మా టీమ్ మీద అతడు చాలా సార్లు డామినేషన్ చూపించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లో విరాటే బిగ్ ఫ్యాక్టర్ కానున్నాడు. అతడు ఎన్నో మార్లు పాకిస్థాన్ బెండు తీశాడు. బిగ్ మ్యాచెస్‌లో మరింత దూకుడుగా ఆడటం, ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేయడం అతడికి అలవాటుగా మారింది’ అని మిస్బా చెప్పుకొచ్చాడు.
బిగ్ మ్యాచెస్‌లో టీమ్‌ను ఎలా గెలిపించాలో కోహ్లీకి బాగా తెలుసునని మిస్సా తెలిపాడు. అతడి విషయంలో స్ట్రైక్ రేట్స్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఎన్ని విమర్శలు వస్తే విరాట్ బ్యాట్ అంత పదునెక్కుతుందని పేర్కొన్నాడు మిస్బా. టీమిండియా బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ఉందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు జట్టులో ఉన్నారని.. భారత జట్టు చాలా క్వాలిటీగా కనిపిస్తోందని మెచ్చుకున్నాడు మిస్బా. అయితే మెగా టోర్నీలో రోహిత్ సేన విజేతగా నిలవాలంటే.. మానసికంగా ఆస్ట్రేలియాలా మరింత బలంగా తయారవ్వాలని సూచించాడు. మరి.. కోహ్లీని తట్టుకోవడం పాక్ వల్ల కాదంటూ మిస్సా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Misbah Ul Haq said – “Virat Kohli holds a mental supremacy over Pakistan. Virat Kohli has that edge, the way he performed against other teams and Pakistan, he damaged the team by playing crucial innings”. pic.twitter.com/1pmO0gA2ro
— Tanuj Singh (@ImTanujSingh) May 16, 2024