iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత గడ్డపై అడుగుపెట్టిన రన్ మెషిన్!

  • Published Mar 17, 2024 | 3:55 PM Updated Updated Mar 18, 2024 | 3:05 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. ఎయిర్ పోర్ట్ లో కోహ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. ఎయిర్ పోర్ట్ లో కోహ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వీడియో: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత గడ్డపై అడుగుపెట్టిన రన్ మెషిన్!

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టాడు. తన భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ కారణంగానే విరాట్ కోహ్లీ ఇన్ని రోజులు లండన్ లో ఉండిపోయాడు. దీంతో ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు పూర్తిగా దూరమైయ్యాడు. ఇక ఇదే టైమ్ లో అతడు ఐపీఎల్ 2024కు, టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న సందేహాలు తీవ్రంగా వ్యక్తమైయ్యాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టాడు కోహ్లీ.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. ఇన్ని రోజులు పితృత్వ సెలవులు తీసుకున్న విరాట్ తిరిగి ఐపీఎల్ సన్నాహాకాల్లో పాల్గొనబోతున్నాడు. శనివారం(మార్చి 16) రాత్రి బెంగళూరు చేరుకున్నాడు విరాట్ భాయ్. త్వరలోనే ఆర్సీబీ శిబిరంలో చేరనున్నాడు. ఇదిలా ఉండగా.. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్ లో కోహ్లీ పాల్గొనబోతున్నాడు.

కాగా.. విరాట్ దాదాపు మూడు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్గానిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. ఇక ఐపీఎల్ 2024లో తొలిమ్యాచ్ లోనే ఆర్సీబీ పటిష్టమైన చెన్నైసూపర్ కింగ్స్ తో తలపడబోతోంది. మార్చి 22న చెపాక్ వేదికగా జరగబోయే ఈ పోరును చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ నుంచి కోహ్లీ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గత కొన్ని రోజుల నుంచి నెలకొన్న సందేహాలకు విరాట్ చెక్ పెట్టాడు.

ఇదికూడా చదవండి: IPL 2024.. ముంబైకి భారీ ఎదురుదెబ్బ! 4 కోట్ల ప్లేయర్ దూరం!