iDreamPost

భారత క్రికెటర్లు ధరిస్తున్న బ్యాండ్‌ ఏంటి? ఎందుకు పెట్టుకుంటున్నారు?

  • Author singhj Updated - 01:10 PM, Fri - 17 November 23

ఈ రోజుల్లో టెక్ గాడ్జెట్ల వాడకం అనేది చాలా కామన్​గా మారింది. క్రికెటర్లు కూడా వీటిని వాడుతున్నారు. టీమిండియాలోని కొందరు స్టార్లు ఒకే రకమైన బ్యాండ్​ను ధరిస్తున్నారు.

ఈ రోజుల్లో టెక్ గాడ్జెట్ల వాడకం అనేది చాలా కామన్​గా మారింది. క్రికెటర్లు కూడా వీటిని వాడుతున్నారు. టీమిండియాలోని కొందరు స్టార్లు ఒకే రకమైన బ్యాండ్​ను ధరిస్తున్నారు.

  • Author singhj Updated - 01:10 PM, Fri - 17 November 23
భారత క్రికెటర్లు ధరిస్తున్న బ్యాండ్‌ ఏంటి? ఎందుకు పెట్టుకుంటున్నారు?

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. సాంకేతిక విప్లవం కారణంగా ప్రతిదీ అందుబాటులోకి వచ్చేసింది. ఒకప్పుడు ఏదైనా టెక్నాలజీని అందరికీ చేరువ చేయాలంటే చాలా ఖర్చయ్యేది. ఏదైనా టెక్ గాడ్జెట్​ను కొనాలంటే కస్టమర్లకు ఖర్చు తడిసి మోపెడయ్యేది. ఒకరకంగా చెప్పాలంటే రిచ్ పీపుల్​కే టెక్నాలజీ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్ గాడ్జెట్స్ తక్కువ ధరకే వస్తున్నాయి. దీంతో వీటి వాడకం కూడా బాగా పెరిగింది. వాళ్లూ, వీళ్లనే తేడా లేదు.. టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకుంటున్నారు.

మిగతా రంగాలతో పోలిస్తే స్పోర్ట్స్​ సెక్టార్​లో టెక్నాలజీ యూసేజ్ ఎక్కువైంది. ప్లేయర్ల ఫిట్​నెస్​తో పాటు వాళ్ల గేమ్, పెర్ఫార్మెన్స్, డైట్.. ఇలా చాలా విషయాలను అసెస్ చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చాలా ఆక్యురేట్​తో రిజల్ట్స్ వస్తున్నాయని అథ్లెట్లు, కోచ్​లు చెప్పడం చూసే ఉంటారు. ఆ గేమ్, ఈ గేమ్ అని కాదు.. ఫుట్​బాల్, క్రికెట్, హాకీ, టెన్నిస్, కబడ్డీ.. ఇలా అన్ని పాపులర్ స్పోర్ట్స్​లో టెక్నాలజీ యూసేజ్ గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగింది. బెటర్ రిజల్ట్స్ వస్తుండటం, వర్క్ లోడ్ తగ్గడంతో టెక్ గాడ్జెట్స్​ను వాడేందుకు క్రీడాకారులు, కోచింగ్ సిబ్బంది మొగ్గు చూపుతున్నారు.

టెక్ గాడ్జెట్స్​లో ఆక్యురెసీ మెరుగ్గా ఉండటంతో టీమిండియా క్రికెటర్లు కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని తెలుస్తోంది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్​తో పాటు స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్​ పర్టిక్యులర్​గా ఒక బ్రాండ్ గాడ్జెట్​ను వాడుతున్నారని సమాచారం. ఆ బ్రాండే వూప్. వూప్ బ్రాండ్​ రూపొందించిన బ్యాండ్లను వీళ్లు ఉపయోగిస్తున్నారని తెలిసింది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూల్స్ ప్రకారం ప్లేయర్లు స్మార్ట్ వాచ్ ఉపయోగించడానికి వీల్లేదు. దీంతో కోహ్లీ, అయ్యర్, సూర్య, సిరాజ్​లు ఈ బ్యాండ్ వినియోగిస్తున్నారని క్రికెట్ వర్గాల సమాచారం. వూప్ బ్రాండ్​కు చెందిన బ్లాక్ కలర్ బ్యాండ్ వేసుకొని భారత క్రికెటర్లు మ్యాచులు ఆడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చేతి కింది భాగంలోనే ధరించాలని ఏమీ లేదట. చేతి పైభాగంలో బైసెప్స్ మీద కూడా ఈ బ్యాండ్ వేసుకోవచ్చట.

ఫిట్​నెస్ ట్రాకర్​గా పనిచేసే వూప్ బ్యాండ్​కు పరిమిత కాలానికి సంబంధించి మెంబర్​షిప్ ఉంటుందని తెలుస్తోంది. దీని ధరెంతో తెలియరాలేదు. అయితే వాడకాన్ని బట్టి వేర్వేరు సబ్​స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయట. ఆరు నెలల ప్లాన్​కు 264 పౌండ్లు, ఏడాది ప్లాన్​కైతే 444 పౌండ్లు కట్టి మెంబర్​షిప్ తీసుకోవాలట. ఇందులో స్ట్రెయిన్, రికవరీ, స్లీప్ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయట. ఒక వ్యక్తి ఎంత ఫిట్​నెస్ చేస్తున్నాడు, రికవరీ అయ్యాడా? లేదా? ఎంత సేపు పడుకుంటున్నాడు? లాంటివి ఈ ఫీచర్ల ద్వారా తెలుసుకోవచ్చట. టీమ్ మేనేజ్​మెంట్​లో భాగమైన ఫిజియో, ట్రైనర్స్ ఉన్నప్పటికీ.. తమ ఫిట్​నెస్​ను తాము ఎస్టిమేట్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు బెటర్​ అవ్వడానికి ఈ బ్యాండ్​ను భారత క్రికెటర్లు వాడుతున్నారని సమాచారం.

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా న్యూజిలాండ్​తో టీమిండియా ఆడిన నాకౌట్ మ్యాచ్​లోనూ మన క్రికెటర్లు ఈ వూప్ బ్యాండ్ వేసుకొని కనిపించారు. ఫీల్డింగ్ చేస్తున్న టైమ్​లో, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొందరు చేతులు, మరికొందరు భుజానికి ఈ బ్యాండ్ వేసుకోవడం కెమెరా కంటికి చిక్కింది. డిస్​ప్లే కూడా లేని ఈ బ్యాండ్ బ్యాటరీ కేవలం రెండు నుంచి మూడ్రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఈ బ్యాండ్ సబ్​స్క్రిప్షన్ భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఏడాదికి రూ.25 వేల వరకు ఉంటుందని సమాచారం. ఇక, ప్రపంచ కప్ సెమీస్​లో కివీస్​ను చిత్తు చేసిన భారత్ ఫైనల్​కు ప్రవేశించింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా ఈ ఆదివారం జరిగే ఫైనల్ ఫైట్​లో తాడోపేడో తేల్చుకునేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది. మరి.. భారత క్రికెటర్లు వాడుతున్న ఈ బ్యాండ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఆఫ్ఘాన్ టీమ్​కు సచిన్ మద్దతు! పాక్​ను ఇంటికి పంపడానికా?

 

View this post on Instagram

 

A post shared by Vaasu Gaddam (@vaasutechvlogs)

 

View this post on Instagram

 

A post shared by TechSatire (@techsatire)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి