iDreamPost

Kohli-Rohit: పరువు నిలబెట్టిన కోహ్లీ, రోహిత్! కుర్రాళ్లను నమ్ముకుంటే ఇక అంతే!

  • Published Jan 10, 2024 | 2:19 PMUpdated Jan 11, 2024 | 11:47 AM

టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు పరువును నిలబెట్టారు. ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్​గా మారిన ఈ ఇద్దరు ప్లేయర్లు తమ విలువ ఏంటో మరోమారు చాటారు.

టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు పరువును నిలబెట్టారు. ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్​గా మారిన ఈ ఇద్దరు ప్లేయర్లు తమ విలువ ఏంటో మరోమారు చాటారు.

  • Published Jan 10, 2024 | 2:19 PMUpdated Jan 11, 2024 | 11:47 AM
Kohli-Rohit: పరువు నిలబెట్టిన కోహ్లీ, రోహిత్! కుర్రాళ్లను నమ్ముకుంటే ఇక అంతే!

ప్రస్తుత వరల్డ్ క్రికెట్​లో టాప్ క్రికెటర్లు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేర్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ భారత ప్లేయర్లు తమ బ్యాటింగ్ టాలెంట్​తో జెంటిల్మన్ గేమ్​ను శాసిస్తున్నారు. హిట్​మ్యాన్ అటు బ్యాటింగ్​తో పాటు ఇటు అద్భుతమైన కెప్టెన్సీతోనూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. గతేడాది అతడి సారథ్యంలో ఆసియా కప్ గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్​లో రన్నరప్​గా నిలిచింది. టెస్టుల్లోనూ రోకో (రోహిత్-కోహ్లీ) జోడీ అదరగొడుతున్నారు. ముఖ్యంగా విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రీసెంట్​గా జరిగిన సౌతాఫ్రికా టూర్​లోనూ కోహ్లీ తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆ సిరీస్​లో అతడనొక్కడే రాణించాడు. ప్రొటీస్​తో టెస్టుల్లో రోహిత్ ఫర్వాలేదనిపించాడు. కానీ యంగ్​స్టర్స్ అందరూ ఫెయిలయ్యారు. దీంతో కుర్రాళ్లను నమ్ముకుంటే కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తాజాగా విడుదలైన టెస్ట్ ర్యాంకింగ్స్​ కూడా ఊతమిస్తోంది.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (864 పాయింట్లు) ఫస్ట్ ప్లేస్​లో నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (859), ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (818) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్​లో భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (775) ఆరో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ (748) పదో పొజిషన్​లో ఉన్నాడు. ఈ ర్యాంకింగ్స్​ గురించి తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ, రోహిత్ భారత్ పరువు నిలిపారని అంటున్నారు. యువ ఆటగాళ్లను నమ్ముకుంటే టీమిండియా పరిస్థితి గోవిందా అని కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ ఉన్నన్ని రోజులే క్రికెట్​లో మన డామినేషనల్ అని చెబుతున్నారు.

వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​ ర్యాంక్​లో శుబ్​మన్ గిల్ కొనసాగుతుండగా.. టాప్​-10లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. గిల్ కూడా 50 ఓవర్ల ఫార్మాట్ తప్పితే టీ20లు, టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. రీసెంట్​గా ముగిసిన సౌతాఫ్రికా టూర్​లోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. టెస్టుల్లోనైతే ఆడితే రోహిత్ లేదంటే కోహ్లీనే అనేలా ఉంది పరిస్థితి. దీని వల్లే ర్యాంకింగ్స్​లో భారత్​కు ఆ దుస్థితి ఎదురవుతోంది. శుబ్​మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్​స్టర్స్ ఇకనైనా ఫెయిల్యూర్ నుంచి బయటపడాలి. త్వరలో ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​ జరగనుంది. ఈ సిరీస్ స్వదేశంలో జరగనున్నప్పటికీ క్వాలిటీ పేస్ అటాక్ కలిగిన ఇంగ్లీష్ టీమ్​ను నిలువరించి వీళ్లు రన్స్ చేయాలి. అప్పుడే సిరీస్ దక్కడంతో పాటు ర్యాంకింగ్స్​లోనూ మెరుగవుతారు. అలాగే ఫ్యూచర్​పై మరింత భరోసా కలుగుతుంది. మరి.. టెస్టు ర్యాంకింగ్స్​లో టీమిండియా క్రికెటర్లు వెనుకంజలో ఉండటం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో BCCI ఫంక్షన్.. సందడి చేయనున్న టీమిండియా, ఇంగ్లండ్ ప్లేయర్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి